అంతర్జాతీయ మార్కెట్లలలోని ఒడిదుడుకులు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో బుధవారం ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభాంతో 65971 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లతో 19800 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
బీపీసీఎల్, టాటా,సిప్లా,టాటా మోటార్స్,కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్స్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ 500 స్టాక్స్ వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో కొనసాగినా.. చివరకు మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అటు ఆసియా మార్కెట్లు ఏఎస్‌ఎక్స్, షాంగాయ్, కాస్పీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
అక్టోబర్ 31, నవంబర్ 1న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారం మంగళవారం విడుదలైంది. అయితే, వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అని ఉత్కంఠతగా ఎదురు చూసిన అమెరికన్ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ రిజర్వ్ తీరుతో అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మార్కెట్లు ఆశించిన స్థాయిలో ట్రేడవ్వలేదు. ఇక మానిటరీ పాలసీలో సైతం ఎలాంటి మార్పులు ఉండబోవని ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్‌లో తేలింది. ఫలితంగా అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment