ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ట్విటర్‌కు జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ సంస్థ హెచ్చరించింది. ఎలాన్ మస్క్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ట్విటర్‌లో విషపూరిత, విద్వేష కంటెంట్ పెరిగిపోయిందని ఆరోపించింది.
ఆన్‌లైన్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఆస్ట్రేలియాలో నమోదవుతున్న ఫిర్యాదులలో మూడింటిలో ఒకటి ట్విటర్‌పై ఉంటోందని ఆ దేశ ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అన్నారు. ఆమె ట్విటర్ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం.
వైఫల్యాన్ని సవరించుకోవడానికి ట్విటర్‌కు 28 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు దాటితే రోజుకు 7 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.3.9 కోట్లు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌మాన్ గ్రాంట్ తెలిపారు.
ఉద్యోగుల తొలగింపుతో చిక్కులు
మస్క్ 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో 80 శాతం ఉద్యోగులను తొలగించారు. వీరిలో కంటెంట్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పనిచేసే కంటెంట్ మోడరేటర్‌లు కూడా చాలా మంది ఉన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించే గ్లోబల్ డ్రైవ్‌కు ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తోంది. ఇన్మాన్ గ్రాంట్ ట్విటర్ ట్విటర్ తప్పులను ఎత్తిచూపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లోనే ఆమె మస్క్‌కి లేఖ రాశారు. సంస్థలో మితిమీరిన ఉద్యోగుల తొలగింపులు ఆస్ట్రేలియన్ చట్టాలను అందుకోలేకపోవడానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్విటర్‌లో జాత్యాహంకార వ్యాఖ్యలకు తాను గురైనట్లు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ స్టాన్ గ్రాంట్ పేర్కొన్నారు. దీనిపై గత మే నెలలో ట్విటర్ యాజమాన్యానికి తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: Olx Layoffs: ఓఎల్‌ఎక్స్‌లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత
Comments
Please login to add a commentAdd a comment