ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులను కేంద్రం ఆశిస్తోంది. ఈవీ వెహిలక్ యూజర్లకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తీర్చే విధంగా భారీ ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ పోయించుకున్నంత తేలికగా ఈవీ బ్యాటరీలు మార్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటులోకి తెస్తామంటూ తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరిన్ని ప్రోత్సాహాకాలను అందించనుంది.
అసలు సమస్య ఇక్కడే
ఈవీ వాహనాల వినియోగం పెంచాలని కేంద్రం ఎంతగా చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశించినట్టుగా లేవు. దీనికి ప్రధాన కారణం ఈవీ వాహనాల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్‌కి పట్టే సమయం. ఆయా ఈవీ వాహనాల బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుంది. ఈ సమస్యకి మెరుగైన పరిష్కారం లభిస్తే తప్ప ఈవీ బూమ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బ్యాటరీ స్వాపింగ్ పాలసీని కేంద్రం తెర మీదకు తెచ్చింది.
బ్యాటరీ స్వాపింగ్ పాలసీ..!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో బడ్జెట్-2022 పలు ప్రతిపాదనలను చేసింది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం బ్యాటరీ మార్పిడి పాలసీను తీసుకువస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రతీ నలభై కిలోమీటర్లకు ఒక బ్యాటరీ స్వాపింగ్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఇంచుమించు పెట్రోల్, డీజిల్ పోయించుకున్నంత తేలిగ్గా డిస్‌ఛార్జ్ బ్యాటరీ స్థానంలో ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను వాహనాల్లో అమర్చుకునే వీలుంటుంది. ఫలితంగా ఫ్యూయల్ రన్నింగ్ అవుట్ సమస్య చాలా వరకు తెరమరుగైపోతుంది. ఇప్పుడున్న ఈవీ వెహికల్ మోడళ్ల ప్రకారం బ్యాటరీ స్వాపింగ్ ప్రక్రియ ఫోర్ వీలర్ వెహికల్ విషయంలో సుదీర్ఘమైన ప్రక్రియగా అయినప్పటికీ టూవీలర్ ఈవీ వాహనాలకు తక్కువ సమయం పడుతుంది.
గ్రీన్ ఎనర్జీపై ముందడుగు..!
బడ్జెట్-2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రముఖ స్థానాన్ని కల్పించారు. అందులో భాగంగా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ. 19,500 వేల కోట్ల భారీ కేటాయింపులు చేశారు. సంప్రాదాయ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరిన్ని ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ బాండ్స్ సేకరణ. గంగా నది పరివాహక ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ఊతమిచ్చేలా చర్యలను కేంద్రం తీసుకొనుంది. 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్‌ను ప్రతిపాదించనుంది. రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్ల కేటాయింపులతో పాటుగా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ ఏర్పాటుచేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు.
చదవండి: Union Budget 2022: పెరిగే..తగ్గే వస్తువుల జాబితా ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment