Whatsapp Starts Testing Stores For Business - Sakshi
Sakshi News home page

WhatsApp: 'ఆన్‌లైన్‌' బిజినెస్‌ కోసం అదిరిపోయే ఫీచర్‌

Published Thu, Sep 16 2021 2:00 PM | Last Updated on Thu, Sep 16 2021 4:32 PM

Whatsapp Starts Testing Stores For Business - Sakshi

వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫీచర్‌తో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా..ఓ వైపు ఈ కామర్స్‌ రంగంపై దృష్టిసారిస్తూనే.. యూజర్లు ఫుడ్‌, రీటైల్‌, లోకల్‌ ప్రాడక్ట్‌లను అమ్ముకునేలా ఆన్‌లైన్‌ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఓ ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫీచర్‌ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు టెస్ట్‌ చేసే పనిలో పడింది.

వాట్సాప్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ఇన్ని రోజులు స్టిక్కర్స్‌, మల్టీ డివైజ్‌ ఆప్షన్లతో హడావిడి చేసిన ఈ మెసేజింగ్‌ యాప్‌... ఇకపై యూజర్లు తన ప్లాట్‌ ఫామ్‌లో ప్రాడక్ట్‌లను అమ్ముకునేందుకు వీలుగా ఆన్‌ లైన్‌ స్టోర్‌లను ఏర్పాటు చేయనుంది. అమెజాన్‌ తరహాలో ఆన్‌లైన్‌ స్టోర‍్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రాడక్ట్‌లను అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ పనితీరును గుర్తించేందుకు బ్రెజిల్ దేశం 'సావో పాలో' అనే ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్‌ సీఈఓ 'మాథ్యూ' రాయిటర్స్‌కు తెలిపారు. 

ఈ సందర్భంగా వాట్సాప్‌ సీఈఓ మాట్లాడుతూ..వాట్సాప్‌లో ఈ కామర్స్‌ బిజినెస్‌ ప్లాట్‌ ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీచర్‌ను డెవలప్‌ చేశాం.ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే బిజినెస్‌ చేసుకునేలా ఈ కామర్స్‌ స్టోర్‌ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. కాగా, ఇప్పటికే ఫేస్‌ బుక్‌ చిన్న చిన్న బిజినెస్‌ల నిర్వహణ కోసం 'షాప్‌' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

చదవండి : 'మనీ హెయిస్ట్‌ సీజన్‌ 5' ఎమోజీలొస్తున్నాయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement