అహ్మదాబాద్: భారత్‌లో తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ ‘జైకోవ్–డీ’అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా ఈ నెలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేయనుంది. ఈ నెలలోనే తమకు అనుమతి లభిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. నెలకు కోటి డోసుల టీకాలను ఉత్పత్తి చేయగలమని, త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 4 కోట్లకు పెంచగలమని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. 2 – 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆ టీకాను నిల్వ చేయాలని పేర్కొంది.
ప్రస్తుతం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాల వినియోగానికి అనుమతి ఉంది. ఇది భారత్‌లో తయారైన తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్ క్యాండిడేట్ అని జైడస్ క్యాడిలా ఎండీ డాక్టర్ శార్విల్ పటేల్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 28 వేల మందికి ఈ టీకా వేశామన్నారు. వారిలో పెద్దలు, ఇతర ప్రాణాంతక వ్యాధులున్నవారితో పాటు 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న పిల్లలు ఉన్నారన్నారు. టీకా సామరŠాధ్యనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని, అనుమతి రాగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment