పరీక్షలకు వేళాయె!
దిగవూరు వద్ద పొలంలోని ఇంటికి వేసిన రోడ్డు
తుమ్మింద కాలనీలో అధ్వానంగా దారి
మామిడి తోటలో గెస్ట్‌హౌస్‌కు వేసిన బాట
జిల్లాలో పది , ఇంటర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది పరీక్షా సమయం. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వం సన్నద్ధమయ్యేందుకు మార్చి, ఏప్రిల్ నెల అత్యంత కీలకం. విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో పది, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం కావడం ముఖ్యమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది. ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్‌లు విడుదల కాగా, త్వరలో పదో తరగతి హాల్‌టికెట్‌లు రానున్నాయి. జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
చిత్తూరు కలెక్టరేట్ : పరీక్షల సమయం సమీపించింది. సంవత్సర కాలం పాటు వ్యయ ప్రయాసల కోర్చి చదువుకున్న పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవితవ్యం పబ్లిక్ పరీక్షలతో ముడిపడి ఉంది. కష్టపడి పరీక్షలకు సన్నద్ధం అయిన విద్యార్థుల భవితవ్యం తేల్చే ప్రత్యేక సమయం దగ్గర పడింది. పుస్తకాలతో కుస్తీ పట్టి మేధస్సును మదించి పొందిన విద్యను మార్కుల రూపంలో ప్రతిఫలం అందించే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ఇక ఐదు రోజులే సమయం ఉంది. కాగా ఈ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు, అదే విధంగా పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ రెండు తరగతుల పరీక్షలు మార్చి నెలలోనే ప్రారంభం అవుతుండడంతో పాఠశాల, కళాశాల విద్యాశాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.
కలెక్టర్ ప్రత్యేక ఫోకస్..
జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్న పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు మార్లు పది, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పలు శాఖల అధికారులకు పకడ్బందీ సూచనలు జారీచేశారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు ఇలా.......
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 30,652 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పదో తరగతి పరీక్షలకు ఇలా......
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 118 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా మౌలిక వసతులు చేపడుతున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షలకు నాలుగు రోజులే..
మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ‘పది’ పరీక్షలు
నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి
మాస్ కాపీయింగ్‌కు
ఆస్కారం లేకుండా చర్యలు
కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
పది, ఇంటర్ పరీక్షల జిల్లా సమాచారం
ఇంటర్ పరీక్షల తేదీలు :
మార్చి 1 నుంచి 20 వరకు
‘పది’ పరీక్షల తేదీలు :
మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు
ఇంటర్ పరీక్షకు హాజరుకానున్న మొదటి సంవత్సరం విద్యార్థులు : 15,482
ఇంటర్ పరీక్షకు హాజరుకానున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 15,170
పదో తరగతి పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు : 21,248
ఇంటర్ పరీక్ష కేంద్రాలు : 50
పదో తరగతి పరీక్ష కేంద్రాలు : 118
టీవీ, సెల్‌కు దూరంగా ఉండాలి
విద్యార్థులు పరీక్షల కాలంలో ముఖ్యంగా టీవీలు, సెల్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉండాలి. గంట చదివిన తరువాత కొంత విరామం తీసుకోవడం అవసరం. సమూహంగా కూర్చొని, చదివిన విషయాన్ని చర్చించడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం, ధ్యానం చేయండి. – సయ్యద్‌మౌలా,
ఇంటర్మీడియట్ డీవీఈవో, చిత్తూరు
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముమ్మరంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడుతున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే సామర్థ్యం ఉన్న అధికారులను విధులకు కేటాయిస్తున్నాం.
– వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు
పరీక్షలకు భయపడాల్సిన అవసరం లేదు..
ఇంటర్, పదో తర గతి విద్యార్థులు భయాందోళన చెందకుండా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలో మాదిరిగానే పబ్లిక్ పరీక్షలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా రాయాలి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.
– సుమిత్‌కుమార్ గాంధీ, కలెక్టర్, చిత్తూరు
పరీక్షలకు వేళాయె!
పరీక్షలకు వేళాయె!
పరీక్షలకు వేళాయె!
Comments
Please login to add a commentAdd a comment