సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు అప్పగించిన ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా లోని గంగాధర నెల్లూరు మండలానికి మార్చి1వ తేదీన సీఎం వస్తున్నారన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం హాజరై లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారని తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అప్పగించిన విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించకూడదని కోరారు. హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా పింఛన్‌ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాలకు పక డ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి వసతి, బారికేడ్లు, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. సీఎం పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా భావించి విధులు నిర్వర్తించాలన్నారు. హెలీప్యాడ్ ఏర్పాటుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారని చెప్పారు. స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు సంబంధిత పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, ఏఆర్ ఏఎస్పీ శివానందకిశోర్, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఇతర శాఖల అధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, రవికుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించాలి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ట్రాన్స్‌కో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్‌నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో లూజు, ఓపెన్ వైర్లు ఉండరాదన్నారు. విద్యుత్ సరఫరా కోసం ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్‌గా అమర్చుకోవాలని చెప్పారు. లైన్‌ల నుంచి వచ్చే వైర్ల ద్వారా దేవాలయానికి సరఫరా అయ్యే చోట ఈ బ్రేకర్‌ను పెట్టాలన్నారు. ఆలయానికి విద్యుత్ అందించే వైర్లు 2.5 చదరపు మిల్లీ మీటర్ల కంటే తక్కువగా ఉండరాదన్నారు. సిల్క్ వైర్లను వాడటం మంచిదికాదని, ప్రతి సర్క్యూట్‌కు ప్రత్యేకించి న్యూట్రల్ ఎర్తవైర్‌ను తీసుకోవాలని సూచించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు సమయంలో విద్యుత్ అధికారుల సహాయ సహకారాలతో భద్రతా చర్యలు పాటించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment