మొగిలీశ్వరా నమోనమః
● కిక్కిరిసిన మొగిలి క్షేత్రం
బంగారుపాళెం : హరహర మహాదేవ శంభోశంకర అంటూ.. మొగిలి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం మొగిలీశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఉదయం స్వయంభు శ్రీ మొగిలీశ్వరసామి, కామాక్షమ్మ వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు మొగిలీశ్వరాలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో బారులు తీరాయి. పలమనేరు, చిత్తూరు డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీసులను నడిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం అనంతరం స్వామి, అమ్మవారు వృషభ వాహనంపై విహరించారు. జిల్లా ఎస్పీ మణికంఠచందోలుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. రఘు కుటుంబ సభ్యులు చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొని భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో బంగారుపాళెం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మునిరాజు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
దేవరకొండపై..: మొగిలి శివాలయానికి అనుబంధ ఆలయమైన దేవరకొండపై బుధవారం మహాశివరాత్రి సందర్భంగా జలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వయంభు శ్రీమొగిలీశ్వర స్వామికి కాణిపాక ఆలయం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాణిపాక వినాయక స్వామి ఆలయ ఈఓ పెంచల కిషోర్ పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు.
నేడు రావణబ్రహ్మవాహనం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అభిషేకం కై లాసగిరి రావణ బ్రహ్మ వాహనం, రాత్రి శేషవాహన సేవలను నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
మొగిలీశ్వరా నమోనమః
మొగిలీశ్వరా నమోనమః
Comments
Please login to add a commentAdd a comment