ముక్కంటి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలను చూసి కంగారు పడ్డారు. సామాన్య భక్తులకు తీవ్రంగా ఇబ్బందివ పడ్డారు. ఎమర్జెన్సీ దారులు లేకపోవడంతో గంటలు తరబడి వేచి ఉన్న మహిళలు బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేసినా, అర్ధరాత్రి వరకు 60 వేల మంది భక్తులు మాత్రమే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం గమనార్హం. అయినప్పటికీ చిన్నపాటి తోపులాటలు, భక్తులు అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మదర్ ఫీడింగ్ కోసం ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ట్రాఫిక్ కష్టాలు
వాహనాలను వంతెనకు అవతలే నిలిపేశారు. అయినప్పటికీ ప్రోటోకాల్ పేరుతో వీఐపీల వాహనాలు ఆలయ నాలుగో గేటు వరకు వచ్చాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలు ఏర్పాడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment