● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమి లేదు ● అన్ని వర్గాలను దగా చేసిన కూటమి సర్కారు ● జిల్లా అభివృద్ధికి నిధులు శూన్యం ● ఎన్నికల హామీలకు ఎగనామం ● ప్రభుత్వ తీరుపై జిల్లా వాసుల అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమి లేదు ● అన్ని వర్గాలను దగా చేసిన కూటమి సర్కారు ● జిల్లా అభివృద్ధికి నిధులు శూన్యం ● ఎన్నికల హామీలకు ఎగనామం ● ప్రభుత్వ తీరుపై జిల్లా వాసుల అసంతృప్తి

Published Sat, Mar 1 2025 8:27 AM | Last Updated on Sat, Mar 1 2025 8:22 AM

● బడ్

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ

జిల్లా సమాచారం

జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌లు 04

జిల్లాలోని మండలాలు 32

జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు 822

జిల్లాలోని గ్రామ పంచాయతీలు 697

జిల్లా జనాభా 18.73 లక్షలు

పురుషులు 9.40 లక్షలు

మహిళలు 9.33 లక్షలు

రూరల్‌ జనాభా 15.04 లక్షలు

అర్బన్‌ జనాభా 3.69 లక్షలు

ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ పేరుతో కరపత్రాలు తీసుకుని ఇంటింటికి వెళ్లారు. అధికారంలోకి వస్తే అంత చేస్తాం..ఇంత చేస్తాం అని మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాకా ప్రజలనే మరిచిపోయారు. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందినప్పటికీ గతంలోనూ...ప్రస్తుతం మేలు చేసిందేమీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఆసుపత్రుల్లో మందులు లేవు. సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన భోజనం, నాడు–నేడు పనులు నిలిపివేత ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు విలయతాండవం చేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ఏదైనా మేలు కలుగుతుందని ఆశించారు. ఎప్పటిలాగే అరచేతిలో వైకుంఠం చూపి బడ్జెట్‌ను మమ అనిపించారని జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి టీడీపీ అధికారంలోకి వ చ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతోంది. చిత్తూరు జిల్లా నుంచి కూటమి ప్రభుత్వంలో (సీఎం చంద్రబాబు)తో సహా 6 గురు ఎమ్మెల్యేలున్నారు. అయితే శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌లో చిత్తూరు జిల్లా అభివృద్ధికి, సంక్షేమ ప థకాల అమలుకు మేలు చేకూరుతుందని అన్ని వ ర్గాలు ఆశతో ఎదురుచూశారు. చివరికి వారి ఆశలన్నీ అడియాశలుగా మారాయి. కూటమి ప్రభుత్వం మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది.

తల్లికి వందనంలో కోతలే...

ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టి మోసం చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తల్లికి వందనం పథకంలో నిధులకు కోత విధించారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లకు పైగా అవసరం ఉంటే బడ్జెట్‌లో రూ.8,276 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు.

నిరుద్యోగులకు అన్యాయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేలు చేస్తుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులు ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే తొమ్మిది నెలలు కావొస్తున్నా నిరుద్యోగులకు చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,78,869 మంది నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మరోసారి మోసగించింది.

సున్నా వడ్డీ రుణాలకు సున్నం

జిల్లా వ్యాప్తంగా 9193 డ్వాక్రా సంఘాలున్నాయి. డ్వాక్రా మహిళలకు ఈ బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం కుచ్చు టోపీ పెట్టింది. ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో జిల్లాలోని డ్వాక్రా మహిళలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

రైతుకు రూ.20 వేలు పాయే..

జిల్లా వ్యాప్తంగా విస్తీర్ణం 2,56,402 హెక్టార్లు ఉంది. ఇందులో సాగు విస్తీర్ణం 41,796 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,18,386 మంది రైతులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే తొమ్మిది నెలల తర్వాత ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకానికి అరకొర నిధులే కేటాయించింది.

బాబు నిజస్వరూపం బయటపడింది

బడ్జెట్‌తో సీఎం బాబు నైజం బయటపడింది. మహిళలను నిలువునా మోసం చేశారు. నీకు రూ.1,500 అంటూ గొ ప్పగా ప్రచారం చేశారు. కానీ ఈ హామీకి బడ్జెట్‌ లో అవకాశం లేదు. నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ అంటూ దగా చేశారు. రెండేళ్లకు కలిపి రూ.21 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ మొక్కుబడిగా కేటాయించి వారి నడ్డి విరిచారు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి

విద్యాభివృద్ధిపై చిన్నచూపు

ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిపై చిన్నచూపు చూడటం తగదు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్‌ చెప్పింది. అయితే ఆ అంశాన్ని పట్టించుకోకుండా 9.86 శాతం నిధులను మాత్ర మే కేటాయించింది. నాడు– నేడు పేజ్‌– 2లో పూర్తి చేయని తరగతి గదులు అనేకం ఉన్నాయి. వీటి ప్రస్తావన బడ్జెట్‌లో చర్చించకపోవడం బాధాకరం.

– జీవీ రమణ, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

పీఆర్‌సీ అమలుకు కేటాయింపులేవీ..

అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మేలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు పీఆర్‌సీ అమలుకు కేటాయింపులే చేయలేదు. బడ్జెట్‌లో పీఆర్‌సీ, ఐఆర్‌ అమలుకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. సీపీఎస్‌, జీపీఎస్‌ కన్నా మెరుగైన పెన్షన్‌ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటన చేయలేదు.

– రెడ్డిశేఖర్‌రెడ్డి,

వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర ట్రెజరర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ1
1/3

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ2
2/3

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ3
3/3

● బడ్జెట్‌లో అన్నివర్గాలకు మోసమే ! ● జిల్లాకు ఒరిగిందేమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement