● హంద్రీ నీవా లైనింగ్ గుత్తేదారుపై ప్రేమతో నిధుల కేటాయ
పలమనేరు : హంద్రీనీవా కాలువలో సాగునీరంది పచ్చటి పంటల కోసం ఇక్కడి రైతులు ఆశ పడుతుంటే ముందు లైనింగ్ పనులు జరిగి కాంట్రాక్టర్ బాగు పడితే చాలన్నట్టుంది ఈ బడ్జెట్ కేటాయింపులు. 2024–25 బడ్జెట్ (సవరణ)లో హంద్రీనీవా కోసం రూ.1586.14 కోట్లను కేటాయించిన కూటమి ప్రభుత్వం, 2025–26 బడ్జెట్‌లో మరో రూ.1657 కోట్లను పెంచి మొత్తం రూ.2,243.59 కోట్లుగా చూపింది. అయితే ఈ పెంచిన బడ్జెట్ ఇప్పుడు కాలువ లైనింగ్ పనులు దక్కించుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు మేలు కోసమేనని అర్థమవుతోంది. దీంతో ఇక్కడి రైతుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలోని పడమటి ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇక్కడి ప్రజలకు కల్పతరువనుకున్న హంద్రీ నీవా కాలువలో కృష్ణా జలాలు భవిష్యత్తులో రానట్టేనని తెలుస్తోంది. కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్–1 తీర్పు అమల్లో ఉన్నంత కాలం కృష్ణాలోని 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ వాడుకొని ఆపై మిగులు జలాలు మాత్రమే హంద్రీ నీవా కాలువకు నీటిని విడుదల చేస్తామని బ్రిజేష్ కుమార్ ట్రిబునల్‌కు కూటమి ప్రభుత్వం సృష్టంగా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవాకు నీరు వచ్చే అవకాశమే లేదు. ప్రధాన కాలువకే నీరు రాకుంటే ఇందులో అంతర్భాగమైన పుంగనూరు ఉప కాలువ, కుప్పం ఉప కాలువలు అలంకార ప్రాయంగా మారడం ఖాయమనే మాట రైతుల్లో నెలకొంది.
పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులకే రూ.642 కోట్లు
హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచి కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 145 నుంచి 282 క్యూసెక్కులకు పెంచే లక్ష్యంగా కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం రూ.480.22 కోట్లకు ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇక కుప్పం బ్రాంచి కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులు రూ.161.78 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ రెండు చోట్ల పనులు చేస్తున్న కంపెనీలకే ఈ బడ్జెట్ నుంచి రూ.642 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ రూ.3,243 కోట్లలో కరెంట్ బకాయిలకు రూ.1000 కోట్లు పోతే మిగిలే రూ.2,243 కోట్లలో లైనింగ్ పనులకు రూ.642 కోట్లు పోగా రూ.1601 కోట్లు. దీంతో ఉమ్మడి జిల్లాకే రెండు వేల కోట్ల అవసరం ఉండగా పెండింగ్‌లోని పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం చేస్తేనే అడవిపల్లి, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణం జరగని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రైతులకు సాగునీరు అందిచకపోగా కాంట్రాక్ట్ కంపెనీలకు మేలు జరిగిన బడ్జెట్‌పై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● హంద్రీ నీవా లైనింగ్ గుత్తేదారుపై ప్రేమతో నిధుల కేటాయ
● హంద్రీ నీవా లైనింగ్ గుత్తేదారుపై ప్రేమతో నిధుల కేటాయ
● హంద్రీ నీవా లైనింగ్ గుత్తేదారుపై ప్రేమతో నిధుల కేటాయ
Comments
Please login to add a commentAdd a comment