వైభవం.. గిరి ప్రదక్షిణం
● ఘనంగా కొండచుట్టు మహోత్సవం ● సమస్త దేవగణాలకు వీడ్కోలు పలికిన పార్వతీపరమేశ్వరులు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్ఞానప్రసూనానాంబ సమేత వాయులింగేశ్వరస్వామివారి కై లాస గిరి ప్ర దక్షిణ అత్యంత వైభవంగా సాగింది. తమ కల్యాణాని కి విచ్చేసిన సకల దేవతా గణాలు, రుషులకు పార్వతీ పరమేశ్వరులు ఘనంగా వీడ్కోలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వస్వామి, జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను ఆలంకార మండపంలో విశేషంగా అలంకరించారు. చప్పరాలపైస్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. రాజగోపురం నుంచి చుతర్మాడవీధుల్లోకి శివపార్వతులు ప్రవేశించారు. భేరివారి మండపం వద్ద భేరికులస్తులు ఇచ్చిన నాగవల్లిని అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం జయరామారావువీధి, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగకాలనీ, కై లాసగిరికాలనీ, రాజీవ్‌నగర్‌కాలనీ మీదుగా గిరిప్రదక్షిణ సాగింది. రామాపురం రిజర్వాయరు సమీపంలోని అంజూరు మండపంలో ఆదిదంపతులు కాసేపు సేదతీరారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయంతోపాటు పలువురు దాతలు అన్నప్రసాదాలు వితరణ చేశారు. అంజూరు మండపం నుంచి వెయ్యిలింగాలకోన, వేడాం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపానికి స్వామి అమ్మవార్లు సాయంత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు.
వైభవం.. గిరి ప్రదక్షిణం
Comments
Please login to add a commentAdd a comment