హోరు | - | Sakshi
Sakshi News home page

హోరు

Published Thu, Mar 13 2025 11:49 AM | Last Updated on Thu, Mar 13 2025 11:45 AM

హోరు

హోరు

యువత పోరు..

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు కార్పొరేషన్‌ : చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో యువత కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడంతోపాటు ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి అందించాలని, మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అమూల్‌ డెయిరీ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్‌ వరకు సాగింది. దారి పొడువునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువకులు ముందుకు సాగారు. సమస్యలు ప్రశ్నిస్తామన్న పవన్‌కళ్యాణ్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. కలెక్టరేట్‌ వద్ద యువకులు, నాయకులను పోలీసులులోనికి పంపించకుండా అడ్డుకున్నారు. కూటమి టీడీపీ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గంటకు పైగా యువకులు కలెక్టరేట్‌ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. లోనికి పంపకుండా అడ్డుకున్న పోలీసుల వైఖరికి నిరసనగా మహిళలు సైతం గేటు వద్ద బైఠాయించి, నినాదాలు చేశారు. అనంతరం రీజినల్‌ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య నాయకులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీని కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొన్న 1500 మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నాయకులు కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు, పలమనేరు మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్‌, వెంకటేగౌడ, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వకర్త కృపాలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, నాయకులు, ప్రజాప్రతినిధులు గాయత్రీదేవి, లీనారెడ్డి, హరిణిరెడ్డి, గౌహతిసుబ్బారెడ్డి, అంజలిరెడ్డి, ధనంజయరెడ్డి, కుమార్‌ రాజా, కేపీ శ్రీధర్‌, జయపాల్‌, ప్రకాష్‌, జ్ఞానజగదీష్‌, రాహుల్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, శశిదీప్‌రెడ్డి, విష్ణు, సోమశేఖర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, మనోహర్‌, శిరీష్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, చిన్నారెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, దామోదర్‌రాజు, సుధాకర్‌రెడ్డి, ఎం.రెడ్డెప్ప, కేశవులు, కృష్ణమూర్తి, బాగారెడ్డి, గణేష్‌యాదవ్‌, ప్రహ్లాద, గిరిరాజారెడ్డి, గురవారెడ్డి, విజయబాబు, మణి, సరితజనార్థన్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, మునిరాజారెడ్డి, హరిబాబు, విజయ్‌కుమార్‌రెడ్డి, అన్బుఅలగన్‌ పాల్గొన్నారు.

ప్రశ్నిస్తామన్న పవన్‌ నువ్వెక్కడయ్యా!

అమూల్‌ డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం అందజేత

తరలివచ్చిన వేలాది మంది

నిరుద్యోగులు, విద్యార్థులు, నేతలు, కార్యకర్తలు

కూటమి సర్కారు కరుణిస్తుందని నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగులు ఆశపడ్డారు.. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారేమోని ఎదురుచూశారు.. విద్యకు భంగం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారేమోనని పది నెలలు పడిగాపులు కాశారు. డీఎస్సీతోపాటు ఇతర కొలువులు ఇస్తారని వేచి చూశారు. ఎప్పుడిస్తారో తెలియక ఆందోళన చెందారు.. సర్కారు నిర్లక్ష్య వైఖరితో విసిగి వేసారిపోయారు.. ఆవేదనతో నలిగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు.. ఈ క్రమంలో తల్లడిల్లిన నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగుల గుండె మండింది. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన యువత పోరుకు నిరుద్యోగులు, యువకులు పోటెత్తారు. జగనన్న పాలనలో సజావుగా అందిన పథకాలను గుర్తు చేసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విజయానందరెడ్డి నేతృత్వంలో యువత పోరు హోరెత్తింది. యవత కదంతొక్కింది. కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళనకు దిగింది. ప్రజా విద్రోహ పాలనకు వ్యతిరేకంగా నినదించింది.

నిలువునా మోసం చేశారు

–వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌ : చంద్రబాబు ఎప్పటిలాగే యువతను నిలువునా మోసం చేశారని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని విద్యార్థులు, ఉద్యోగాలు లేని నిరుద్యోగుల పక్షాన బుధవారం జిల్లా కేంద్రంలో యువత పోరు హోరెత్తింది. జిల్లా కేంద్రంలోని అమూల్‌ డెయిరీ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీకి వినతిపత్రం అందజేశారు. యువత పోరులో పాల్గొన్న పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు నాడు దివంగత వైఎస్సార్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారన్నారు. అలాగే గత ఐదేళ్లలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్న వసతిదీవెన, విద్యాదీవెన పథకాలతో సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు అందించారన్నారు. ప్రస్తుతం ఐదో త్రైమాసికం జరుగుతున్నా ఇప్పటివరకు ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయలేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై పోరును కొనసాగిస్తామని చెప్పారు.

యువతకు నిరుద్యోగ భృతి ఎక్కడ ?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వస్తానే నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి మాట నిలబెట్టుకోలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటి లాగే ఈసారి కూడా నిరుద్యోగులను మోసగించారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,200 కోట్లు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 2014లో ఇలానే ఎలాంటి హామీలు అమలు చేయలేదన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో గత ఐదేళ్లల్లో రూ.18 వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేసినట్లు తెలిపారు. 17 మెడికల్‌ కళాశాలలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వాటిని ప్రస్తుతం చంద్రబాబు ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్న మద్యం బ్రాండ్‌లనే ప్రస్తుతం విక్రయిస్తూ, ధరలు పెంచి మరీ దోచుకుంటున్నట్లు విమర్శించారు.

గేట్లకు తాళం వేసి.. మహిళల దురుసుగా ప్రవర్తించి..

యువత పోరుకు విచ్చేసిన మహిళలను పోలీసులు దురుసు ప్రవర్తనతో కలెక్టరేట్‌లోనికి రానివ్వకుండా నెట్టేశారు. వన్‌ టౌన్‌ సీఐ మహిళలను లోనికి రానివ్వకుండా కలెక్టరేట్‌ గేట్లకు తాళం వేసి దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి హరిణిరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి నాయకులు హరిషారెడ్డి గంట పాటు గేటు వద్దే బైఠాయించి కూటమి తీరుపై నినాదాలు చేశారు. లోనికి అనుమతి లేదని చెప్పాల్సిన పోలీసులు ఇలా మెహన గేటు వేసి దురుసు ధోరణి ప్రవర్తించడం దారుణమని గాయత్రీదేవి మండిపడ్డారు. మహిళలను కంట్రోల్‌ చేసేందుకు మహిళా పోలీసులను బందోబస్తులో పెట్టుకోకపోవడం సరికాదన్నారు. విద్యార్థులు, యువత సమస్యలపై శాంతియుతంగా నిరసన చేసేందుకు వస్తే దురుసుగా ప్రవర్తించడం అన్యాయమన్నారు.

నిరుద్యోగులకు నిలువునా మోసం

కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో మాటలు, హామీలు తప్పితే అమలు చేయడం లేదు. వేలాది మంది వాటిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఉద్యోగం రాక, కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తాం లేకుంటే , నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా భృతి మాటే లేదు.

– శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్‌

ఇంటికో ఉద్యోగం కల్పించాలి

టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి. నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతినెల రూ.3వేల నిరుద్యోగభృతి మంజూరు చేయాలి. అలా చేస్తే ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.

– భరత్‌, ఎమ్మెల్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
హోరు1
1/4

హోరు

హోరు2
2/4

హోరు

హోరు3
3/4

హోరు

హోరు4
4/4

హోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement