ట్రిప్పులు యథావిధిగా తిరగాల్సిందే
తిరుపతి నుంచి కాణిపాకం గ్రామానికి 14 సర్వీసులు నడుస్తున్నాయి. అందులో 8 సర్వీసులు అద్దె బస్సులు, 6 సర్వీసులు ఆర్టీసీ బస్సులున్నాయి. అద్దె బస్సులో ఒక్కో సర్వీసు రోజూ తిరుపతి– కాణిపాకం మధ్యలో మూడు ట్రిప్పులు తిరగాల్సిందే. మొత్తంగా 8 అద్దెబస్సులు రోజుకు(3 ట్రిప్పులు చొప్పున) 24 ట్రిప్పులు నడపడానికి నిర్ణయించారు.
తిరుపతి–కాణిపాకం హైర్ సర్వీసులు తిరగాల్సిన మార్గ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత మంగళవారం మార్గ వివాదంతో అద్దెబస్సులు ఆగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు హైర్ బస్సుల యాజమాన్యాలు చర్చలు జరిపాయి. ఒక ఒప్పందానికి వచ్చి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో మార్గదర్శనం కుదిరినట్లు అయ్యింది.
తిరుపతి అర్బన్: తిరుపతి–కాణిపాకం మార్గంలో నడుస్తున్న హైర్ బస్సుల(ఆర్టీసీ అద్దె బస్సులు)వివాదాలకు తెరపడిందని అంతా భావిస్తున్నారు. కొద్ది రోజులుగా హైర్ బస్సులపై రూట్ వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం(ఈ నెల 25న) అరకొర బస్సులు మినహా మిగిలిన హైర్ బస్సులను కాణిపాకం గ్రామానికి నడపకుండా తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులుగా ఆర్టీసీ అధికారులకు అద్దె బస్సుల యాజమాన్యంతో జరిపిన చర్చలు ఓ కొల్కికి వచ్చాయి. తిరుపతి నుంచి కాణిపాకం గ్రామానికి వెళ్లే సమయంలో బస్టాండ్ నుంచి గరుడవాఽరధి కింద మార్గంలో లీలాలమహల్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా కాణిపాకం గ్రామానికి వెళ్లాల్సి ఉంది. కాణిపాకం నుంచి తిరుపతికి వచ్చే సమయంలో కపిలతీర్థం నుంచి గరుడ వారధిపైన బస్టాండ్‌కు వచ్చేలా నిర్ణయించారు.
వెళ్లేటప్పుడు వారధి కిందే..
వచ్చేటప్పుడు వారధిపైన
తిరుపతి–కాణిపాకం హైర్ బస్సులపై క్లారిటీ
రూట్ వివాదాలకు తెరపడినట్లేనా?
చర్చలు సఫలం
ప్రయాణికులకే తొలి ప్రాధాన్యం
ఆర్టీసీ ప్రయాణికులకే తొలి ప్రాధాన్యత కల్పిస్తుంది. అద్దె బస్సులు నాలుగేళ్ల అగ్రిమెంట్ ప్రకారం తిరుపతి బస్టాండ్ నుంచి కాణిపాకం గ్రామానికి వెళ్లే సమయంలోనూ వచ్చే సమయంలోనూ గరుడవారధి కింది మార్గంలోనే వెళ్లాల్సి ఉంది. ఒక్కో సర్వీస్ రోజుకు 3 ట్రిప్పులు తిప్పాలని నిర్ణయించాం. అయితే డ్రైవర్లు కొన్ని ఇబ్బందులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే సమయంలో గరుడవారధి కింది మార్గంలోను, వచ్చే సమయంలో మాత్రమే వారధిపై మార్గంలో నడపడానికి అంగీకరించాం. దీంతో హైర్ బస్సుల సమస్య పరిష్కారించాం. భక్తుల సౌకర్యం కోసమే వెళ్లే సమయంలో వారధి కింది భాగంలో వెళ్లాలని స్పష్టం చేశాం.
– బాలాజీ, డిపో మేనేజర్,
తిరుపతి బస్టాండ్
‘మార్గ’దర్శనం కుదిరింది!