వచ్చే ఏడాది నుంచి ‘సూపర్ సిక్స్’
● ‘రచ్చబండ’లో ీసీఎం సతీమణి భువనేశ్వరి
గుడుపల్లె : సూపర్ సిక్స్ పథకాలు వచ్చే ఏడాది నుంచి అందరికీ అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు త్వరలో అందజేస్తామన్నారు. గుడుపల్లె మండలంలోని గుడిచెంబగిరిలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మొదటి రోజు బుధవారం గుడుపల్లె మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం గుడిచెంబగిరి గ్రామంలో పర్యటించి మహిళలతో ప్రసంగించారు. హంద్రీ–నీవా కాలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో కాలువలో నీరు వచ్చి తాగు, సాగు నీరు కొరత లేకుండా చేస్తామన్నారు. పథకాల పట్ల అసంతృప్తి పడకుండా నమ్మకం పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, డాక్టర్ సురేష్‌బాబు, టీడీపీ బోర్డు డైరెక్టర్ శాంతారాం, పార్టీ మండల అధ్యక్షుడు బాబు నాయుడు. మాజీ ఏఎంసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.