ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి
నిండ్ర: ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. నిండ్ర ప్రభుత్వ వైద్యశాలను ఆమె బుధవారం తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ తల్లీబిడ్డ ఆరోగ్య సేవలు వందశాతం అమలుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎచ్‌ఎం ప్రొగ్రాం ఆఫీసర్ ప్రవీణ, ఎఫ్‌ఆర్‌ఎస్ కోఆర్టినేటర్ నవీన్ తేజ్, నిండ్ర వైద్యాధికారి వినిషా తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణకు న్యాయశాఖ స్థలం 25 సెంట్ల అప్పగింత
చిత్తూరు అర్బన్: నగరంలో హైరోడ్డు విస్తరణ కోసం తన పరిధిలోని 25 సెంట్ల భూమిని జిల్లా న్యాయశాఖ కార్పొరేషన్‌కు అప్పగించింది. ప్రస్తుతం నగరంలో హైరోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ భూములను కార్పొరేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయశాఖ ప్రహరీలోపల ఉన్న 25 సెంట్ల భూమిని హైకోర్టు ఆదేశాలతో కార్పొరేషన్‌కు అప్పగించారు. దీంతో ఇప్పటికే ఉన్న ప్రహరీని తొలగించి, కొత్తగా ప్రహరీ నిర్మించడానికి కార్పొరేషన్ అధికారులు బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగర అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కమిషనర్ నరసింహప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ న్యాయవాదులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలో
విద్యార్థి డిబార్
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పదో రోజు పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు డీవీఈఓ సయ్యద్‌మౌలా వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సోమల మండలం ఎస్‌కేవీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 14,034 మంది విద్యార్థులకుగాను 13,424 మంది హాజరుకాగా, 610 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
నేడు కవయిత్రి మొల్ల జయంతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో గురు వారం కవయిత్రి అటుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించనన్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో సంఘ నాయకులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.
లెవెల్ క్రాసింగ్‌లు మూసివేత
చిత్తూరు కలెక్టరేట్ : రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జిల్లాలో రేణిగుంట–అరక్కోణం సెక్షన్ పరిధిలోని లెవెల్ క్రాసింగ్‌లు మూసివేయనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేణిగుంట– అరక్కోణం సెక్షన్ పరిధిలో నగరి–వేపగుంట, వేపగుంట యార్డు, వేపగుంట–పుత్తూరు, తడుకు యార్డులో ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణ, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతోందన్నారు. ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతున్నందున లెవెల్ క్రాసింగ్‌లను శాశ్వతంగా మూసి వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment