300 మామిడి చెట్లు దగ్ధం
– రూ.2 లక్షల పంట నష్టం
రొంపిచెర్ల: గానుగచింత గ్రామ పంచాయతీలో బుధవారం రాత్రి 300 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల పంట నష్టం వాటిల్లింది. బాధితుల కథనం మేరకు.. పెద్దమాదిగపల్లెకు చెందిన వి.రామచంద్ర నాలుగు ఎకరాల్లో సుమారు 300 మామిడి చెట్ల ను సాగు చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి మామిడి తోటకు నిప్పు పెట్టడంతో చెట్లు పూర్తిగా కాలి పోయాయి. దీంతో సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని రైతు రామచంద్ర కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు మామిడి తోటకు నిప్పు పెట్టారని తహసీల్దార్, రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
హోషికియా కారు షోరూం ప్రారంభోత్సవం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని ఇరువారం ప్రాంతంలో గురువారం హోషికియా కారు షోరూం ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేక పూజలతో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి ప్రారంభించారు. నూతనంగా వి డుదలైన కియా సిరోస్ ఆవిష్కరించారు. ఆయ న మాట్లాడుతూ.. ఇక్కడ అన్ని కార్ల సేల్స్, సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభ ధర రూ.8.99 లక్షల నుంచి ఉందన్నారు. పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చెరకు నిరంజన్, భారతి, హోషిమరెడ్డి తది తరులు పాల్గొన్నారు.
31లోపు దరఖాస్తు చేసుకోండి
– ఉప కార్మిక కమిషనర్ ఓంకార్‌రావు
చిత్తూరు కార్పొరేషన్: ఈ–శ్రమ్ గుర్తింపు కార్డు కలిగిన అసంఘటిత రంగ కార్మికులు పరిహారం కోసం ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఉప కార్మిక కమిషనర్ ఓంకార్‌రావు తెలిపారు. కార్మికులు ఎవరైనా 2021 ఆగస్టు 24 నుంచి 2022 మార్చి 31 మధ్య ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా వారి వారసులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించారన్నారు. ప్రమాద మరణానికి రూ.2 లక్షలు, పూర్తి వైకల్యానికి రూ. లక్ష మంజూరు చేస్తారన్నారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు సమీపంలోని కార్మికశాఖ కార్యాలయం లేదా డీఆర్‌డీఏ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
300 మామిడి చెట్లు దగ్ధం