ఏనుగుల దాడిలో దూడ మృతి
–పంటలకు నష్టం
యాదమరి: మండలంలో ఏనుగుల ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు పంటలకు నష్టం కలిగించిన ఏనుగులు తాజాగా గురువారం మండలంలోని దళవాయిపల్లెకు చెందిన రైతు మణికి చెందిన దూడను బలిగొన్నాయి. అలాగే రాజగోపాల్‌కి చెందిన కొబ్బరి, గజేంద్రకి చెందిన బోరు మోటారు, గుణశేఖర్‌కు చెందిన వరి పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నష్ట పరిహారాన్ని అంచనా వేసి త్వరలోనే బాధితులకు ఇస్తామని, అలాగే ఏనుగుల కట్టడికిగాను సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని పశ్చిమ విభాగ ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ సంకేత్ గరుడ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.