మహిళల రక్షణకే ‘శక్తి’ బృందాలు
చిత్తూరు అర్బన్ : మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా ఉండేందుకు, ముందస్తు అప్రమత్తం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ బృందాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆదేశించారు. గురువారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో మహిళలను చైతన్యం చేయడానికి శక్తి బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయాల్లో నిర్లక్ష్యం వద్దని, దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించాలన్నారు. ఇదే సమయంలో నేరం చేసిన నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు ఉండాలన్నారు. గంజాయి, ఎర్ర చందనం, సారా, ఇసుక స్మగ్లింగ్ చేసే వ్యక్తులపై పీడీ యాక్టులు పెట్టడానికి వెనకాడొద్దని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి గస్తీలు పెంచాలని, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలబారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. పోలీసు వాట్సాప్ నంబర్ 94409 00005, సైబర్ మిత్ర 91212 11100 నంబర్లను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గతనెల ఉత్తమ ప్రతిభ చూపించిన చిత్తూరు వన్‌టౌన్ సీఐ జయరామయ్య, పుంగనూరు సీఐ శ్రీనివాసులు, కల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వరులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment