పలమనేరు కోర్టులో రూ.1.02 కోట్లకు ఐపీ
పలమనేరు : నియోజకవర్గంలోని వీకోటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యాపారి రూ.1.02 కోట్లకు స్థానిక కోర్టులో ఐపీ దాఖలు చేసినట్లు గురువారం తెలిసింది. అతడు వీకోటలో వ్యాపారాలు చేస్తూ భారీగా నష్టపోయినట్లు తాను అప్పులు తీసుకున్న 16 మందికి అప్పులు చెల్లించలేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్థానిక లాయర్ కవిత ద్వారా ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
కుప్పంలో
సింగపూర్ బృందం
కుప్పం : కుప్పం మున్సిపాలిటీలో డీపీఆర్ సిస్టం తయారు చేసేందుకు సింగపూర్‌నకు చెందిన సుర్బాన్ జార్జ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఓ బృందం కుప్పంలో పర్యటించింది. మున్సిపాలిటీ పరిధిలోని హరితా రిసార్ట్, జమీందర్ పార్కు, డీకేపల్లి పార్కు, బస్టాండు, ఎన్‌టీఆర్ స్టేడియం, కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్‌తో పట్టణంలో 11 ప్రాంతాలను పరిశీలించారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ముగిసిన విరించి
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని వేదికగా గత రెండు రోజుల పాటు సాగిన విరించి–2025 టెక్‌ఫెస్ట్ గురువారం ముగిసింది. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయం, సాంస్కృతికం ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి. విద్యార్థినులు ఆటపాటలతో అదగొట్టారు. ముగింపు కార్యక్రమానికి వేదిక్ వర్సిటీ వీసీ సదాశివమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రెండవ రోజు విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టే పోటీలను నిర్వహించారు. అనంతరం ముఖ్యఅతిథి చేతుల మీదుకు ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులందించారు. వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజిని, డైరెక్టర్ మల్లికార్జున, అధ్యాపకులు, సుమారు 900మంది విద్యార్థులు పాల్గొన్నారు.