పచ్చ‘ప్రళయం’ | - | Sakshi
Sakshi News home page

పచ్చ‘ప్రళయం’

Published Sat, Mar 15 2025 12:41 AM | Last Updated on Sat, Mar 15 2025 12:41 AM

పచ్చ‘

పచ్చ‘ప్రళయం’

డ్రైవర్స్‌ కాలనీలో పచ్చప్రళయం కొనసాగు తోంది.సర్కారు అండతో తెలుగు తమ్ముళ్లు గూండా గిరి చేస్తున్నారు.

గణేశా అని సంబోధించాలి

వరసిద్ధుడి ఆలయంలో అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్‌, సెట్‌లో తొలుత గణేశా అని సంబోధించాలని ఈఓ తెలిపారు.

శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025

కాణిపాకం/చిత్తూరు కార్పొరేషన్‌: క్రయ విక్రయాల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అవేమీ మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కల్తీ విక్రయాలు ఆగడం లేదు. ఈ తరుణంలో ఏం చేయాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలన్న విషయం నేటికీ చాలా మందిలో అవగాహన లేదు. ఈ తరుణంలో వినియోగదారులు మేలుకోవాలని పలు శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. కొనే ముందు పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మార్కెట్‌లో మోసాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

చల్లగా దోచేస్తున్నారు

అసలే వేసవికాలం.. మంచినీటి ప్యాకెట్లు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలకు గిరాకీ ఎక్కువ. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు.. సరైన ముద్రలు, బిల్లులు లేకుండానే నాసిరకం సరుకును మార్కెట్లోకి వదిలేస్తున్నారు. తయారీ తేదీ లేకుండానే లక్షల కొద్దీ నీళ్ల ప్యాకెట్లను విక్రయించేస్తున్నారు. వీటిపై అధికారులు 31 కేసులు నమోదు చేసి, రూ.75,500 అపరాధం విధించారు.

తప్పుల తక్కెడ

వే బ్రిడ్జిలపై గత ఆర్థిక సంవత్సరంలో 17 కేసులు నమోదయ్యాయి. హోల్‌సేల్‌ డీలర్లపై 5, రిటైల్‌ డీలర్లపై 79 కేసులను నమోదు చేశారు. చౌక దుకాణాల్లో మోసాలపై 16 కేసులు నమోదయ్యాయి. డీలర్లు తూకంలో డబ్బాలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం మిల్లులపై 37, ఎరువుల దుకాణాలపై 25 కేసులు నమోదుయ్యాయి.

ఇంధనం

● పెట్రోల్‌, డీజల్‌ నింపడానికి ముందు మీటర్‌ రీడింగ్‌ 0లో ఉందో లేదో చూడాలి.

● బంకు సిబ్బంది మాటల్లో పెట్టి దృష్టి మరల్చి రీడింగ్‌ జంప్‌ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలి.

● అనుమానం వస్తే బంకులోని ముద్రతతో ఉన్న ఐదు లీటర్ల పరిమాణం గల కొలత పాత్ర ద్వారా సరిచూసుకోవచ్చు.

● కొనుగోలు చేసిన పెట్రోలు/డీజిలు సరైన ధర చెల్లిస్తున్నారో? లేదో గమనించి బిల్లు తీసుకోవాలి.

● ఇంధనం నాణ్యత మీద అనుమానం ఉంటే బంకు దగ్గరున్న ఫిల్టర్‌ పేపర్‌ తీసుకుని ఒక చుక్క పెట్రోలు దానిపై వేయాలి. రెండు నిమిషాల్లో ఎలాంటి మరక లేకుండా ఆవిరైతే నాణ్యత ఉందని అర్థం.

● తూనికలు కొలతల చట్టం నిబంధనలు రూల్‌ 10 షెడ్యూలు 1 టేబుల్‌ 2 ప్రకారం ఎరువులు, విత్త నాలు, సిమెంటు, బియ్యం వినియోగదారుల సమక్షంలోనే తూకం వేసి, ప్యాకేజీపై ముద్రించిన నికర బరువు ఉందో లేదో సరిచూసి డెలివరీ ఇవ్వాలి.

● వ్యాపారుల దగ్గర తప్పనిసరిగా ప్యాకేజీలను తూకం వేసే పరికరం ఉండాలి.

● వ్యాపారులు ఉపయోగిస్తున్న తూనిక పరికరం తూనికలు కొలతల శాఖకు చూపించి ముద్రలు వేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి. దీన్ని పరికరం దగ్గరే స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి.

● వ్యాపార స్థలంలో ఉన్న ప్యాకేజీలపై లీగల్‌ మెట్రాలజీ చట్టం, నిబంధనల ప్రకారం అన్ని అంశాలు తప్పనిసరిగా ముద్రించి ఉండాలి.

ఇఫ్తార్‌ సహర్‌

శనివారం (సా) ఆదివారం (ఉ)

చిత్తూరు 6–29 5–00

పుంగనూరు 6–30 5–04

బంగారు కొనుగోలులో భద్రం

● ఆభరణాల్లో రాళ్లకు, బంగారానికి వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో గమనించాలి. చెల్లించిన సొమ్ముకు సరిపడా తూకం గల బంగారు ఆభరణాలు అందుతున్నాయో? లేదో తూనిక యంత్రంపై సరిచూసుకోవాలి.

● బంగారం నగల రశీదు (బిల్లు)లో స్వచ్ఛత (క్యారటేజ్‌) తెలియజేశారో లేదో గమనించండి.

● రశీదులో స్వచ్ఛతకు అనుగుణంగా బంగారం గ్రాము ధర ఉందో లేదో చూడండి.

● బంగారు నగలు కొన్నప్పుడు ఒక మిల్లీ గ్రాము వరకు కచ్చితత్వం గల ఎలక్ట్రానిక్‌ తూనిక యంత్రం వాడుతున్నారో? లేదో గమనించాలి.

● బంగారు నగలు తూకం వేసే ఎలక్ట్రానిక్‌ కాటాపై తూనికలు కొలతల శాఖ సీలు ఉందో? లేదో చూడాలి.

హక్కులు తెలుసుకోవాలి

వినియోగదారులు మరింత చెతన్యవంతులు కావాల్సి ఉంది. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. మోసాలు జరిగినట్లు గుర్తిస్తే ప్రశ్నించడానికి ఈ బిల్లులే ఆధారం అవుతాయి. ఎవరైనా మోసాపోయాం అని అధికారుల ఫిర్యాదు చేసినా వారికి అండగా ఉంటాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సహకారం అందిస్తాం. వినియోగదారులు కచ్చితంగా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి.

– శేషాద్రి జిల్లా వినియోగదారులసంఘ అధ్యక్షుడు, చిత్తూరు

1967కు కాల్‌ చేయండి

వస్తువుల కోనుగోలులో సమస్యలుంటే 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయండి. తూకం, కొలతల్లో తూనికల కొలతలశాఖ ముద్ర ఉండాలి. ఏ వస్తువు అయిన ఎమ్మార్పీ కంటే ఎక్కవ ధరకు విక్రయించకూడదు. జిల్లాలో గత 11 నెలల్లో డీసీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పలు దుకాణల్లో తనిఖీలు చేసి 721 కేసులు నమోదు చేసి రూ.80 లక్షల వరకు జరిమానా విధించాం. వినియోగదారులకు ఎటువంటి సమస్య ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుపవచ్చు. మాకు వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

– స్వామి, సహాయకమిషనర్‌, తూనికల కొలతలశాఖ

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నేటి నుంచే ఒంటిపూట బడులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు శుక్రవారం డీఈఓ కార్యాలయానికి చేరా యి. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజ మాన్య పాఠశాలలు శనివారం నుంచి ఒంటి పూ ట బడులను తప్పనిసరిగా అమలు చేయాలన్నా రు. ప్రైవేట్‌ యాజమాన్యాలు పూర్తి రోజు పాఠశాలలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలన్నారు. అలాగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని పే ర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సహకారంతో పాఠశా లల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేసుకోవాలన్నా రు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ప్రతి పాఠశాలలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని డీవైఈఓ, ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు.

సెలవులో కలెక్టర్‌

– ఇన్‌చార్జి కలెక్టర్‌గా విద్యాధరి

చిత్తూరు కలెక్టరేట్‌: వ్యక్తిగత పనుల నిమిత్తం కలెక్టర్‌ సెలవు పెట్టడంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా విద్యా ధరి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కలెక్టర్‌ సు మిత్‌కుమార్‌ గాంధీ సెలవు పెట్టారు. అప్పటి వర కు జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

మామూళ్లు ఇవ్వలేదని..

హైవే మట్టి తరలింపునకు బ్రేకులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు –తచ్చూ రు హైవే రోడ్డుకు మట్టి తరలిస్తుంటే కూటమినేతలు అడ్డుపడ్డారు. ఇస్తే మామూళ్లు ఇవ్వండి.. లేదంటే ఆపేయండి అంటూ కూటమి నేతలు మ ట్టి తరలింపును పట్టుబట్టి ఆపేశారు. ఈ రోడ్డుకు చిత్తూరు మండలం పెరుమాళ్లకండ్రిగ పంచా యతీ వరదరాజులపల్లి సమీపంలోని గుట్టలో మ ట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని పసిగట్టిన కూటమినేతలిద్దరు కొండెక్కి కూర్చుకున్నారు. ఐదుగురితో కలిసి బుధవారం రాత్రి హైవేకు మ ట్టి తరలిస్తున్న వ్యక్తితో బేరసాలు చేయాలని చూ శారు. ఆ బేరం తెగకపోవడంతో రోడ్డు పాడవుతోందని సాకు చూపి ఊళ్లో పంచాయితీ పెట్టించారు. ఆ పెద్దమనుషులు వీరి ఆగడాలు తెలిసి అది రెవెన్యూ అధికారులు చూసుకుంటారు..మా కు సంబంధం లేదని చేతులెత్తేశారు. చేసేదీ లేక మండల నాయకుల సాయం తీసుకుని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచారు. పట్టుబట్టి మట్టి తరలింపును ఆపేశారు. దీంతో హైవేకు మట్టితరలిస్తున్న నిర్వాహకులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.

తక్కువ తూకం..నాణ్యత లోపం..గడువుకు ముందే దెబ్బతినడం..నిర్లక్ష్యసమాధానం..బాధ్యతారాహిత్యం.. నిత్యావసర వస్తువుల మొదలు అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల వరకు ముందు..వెనుక దగా.. చివరకు నష్టపోయేది వినియోగదారుడే. ఈ లోపాలపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు వ్యాపారులు. ఇలాంటి సందర్భాల్లో చట్టం ఏమీ చేయాలో తెలియని కొనుగోలుదారుడికి రక్షణగా చట్టం ఉంది. దాని ద్వారా ప్రశ్నించే హక్కు ఉంది. మనం చేయాల్సింది వినియోగించుకుని మేలుకోవడమే. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.

క్రయ.. విక్రయాల్లో ప్రజలు అయోమయం

తూకాల్లో మోసాలు

జోరుగా కల్తీలు

మోసాలు, కల్తీలపై ప్రజలకు అవగాహన లేమి

మేల్కోవాలంటున్న అధికారులు

వ్యాపారం కేసులు అపరాధ రుసుం

(రూపాయిల్లో)

పెట్రోల్‌, ఎల్‌పీజీ 10 1,93,000

బంగారు దుకాణాలు 2 3,00,000

ఐరన్‌, స్టీల్‌ 13 88,500

హార్డ్‌వేర్‌ 109 4,29,000

రైతుబజార్‌ 18 15,000

మాంసం దుకాణాలు 36 39,000

ఎలక్ట్రానిక్స్‌ 15 57,000

టెక్స్‌టైల్స్‌ 5 1,49,000

రేషన్‌షాపులు 16 42,500

ఆయిల్‌ దుకాణాలు 8 64,500

స్వీట్స్‌ 24 1,34,000

రైస్‌మిల్లు, దుకాణాలు 37 3,00,000

వెయింగ్‌ బ్రిడ్జిలు 17 5,93,000

డిస్పెన్సింగ్‌పంపులు 6 2,39,000

ఈ–కామర్స్‌ 6 4,60,000

తూనికల కొలతలపై ఫిర్యాదులకు..

చిత్తూరు డివిజన్‌ – 78938 13707

చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు, నగరి, నిండ్ర, విజయపురం మండలాలు

పలమనేరు డివిజన్‌ – 97044 95165

పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు

వినియోగదారుడా మేలుకో..

ప్యాకేజీలపై ముద్రించిన బరువు కచ్చితంగా ఉందో లేదో ఎలక్ట్రానిక్‌ కాటాలో సరిచూసుకోవాలి.

తూనిక రాయి అడుగు భాగాన ముద్రిత సంవత్సరం, విభాగం, ఇన్‌స్పెక్టర్‌ సంఖ్య ఉన్నాయో? లేదో చూడాలి. పాత్రలకు సొట్టలున్నాయేమో? గమనించాలి.

ఎలక్ట్రానిక్‌ కాటాపై ప్రామాణిక తూకం రాళ్లు పెట్టి అది సరిగా పనిచేస్తుందో? లేదో చూడాలి. ఎలక్ట్రానిక్‌ కాటాపై ఉన్న ఏ బటన్‌ నొక్కినా తేడా కనిపించకూడదు.

ప్యాకేజీ వస్తువులపై తయారీ తేదీ, నెల, సంవత్సరం.. తయారీదారు పూర్తి చి రునామా ఫోన్‌ నంబర్‌, ఈ–మెయిల్‌ చిరునామా ఉన్నాయో? లేవో చూసుకోవాలి.

ప్యాకేజీలు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన నాణ్యమైన సరకులని భావించొద్దు. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసీ మోసపోవద్దు. జంబో సైజు, ఎకానమీ సైజు వస్తువుల కొనుగోలులోనూ అప్రమత్తంగా ఉండాలి.

మార్పు దిశగా..

సినిమా థియేటర్లల్లో అధిక ధరలను నియంత్రించే దిశగా 629 జీఎస్‌ఆర్‌ ఉత్తర్వులు అమల్లోకొచ్చాయి. దీని ప్రకారం వస్తువులపై ధరలు పెంచి ముద్రించకూడదు..అధిక ధరలకు విక్రయించకూడదు. ఒకే కంపెనీ ఉత్పత్తిని వేర్వేరు చోట్ల రెండు రకాల ధరలతో విక్రయించకూడదు. అయితే కొన్నిచోట్ల ప్రీమియం ప్రోడక్టుల పేరుతో పానీయాలు, ఇతర సరుకులను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లూజు అమ్మకాలపై నియంత్రణ లేకపోవటంతో తినుబండారాలు, శీతల పానీయాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. థియేటర్లలో అధిక ధరలపై 22 కేసులు నమోదు కాగా, రూ.1,32,500 అపరాధం వసూలు చేశారు.

పెట్రోలు బంకుల్లో మోసాల నుంచి గట్టేక్కేందుకు కంపెనీలు ఐరన్‌ కేసింగ్‌ సీజ్‌ చేసిన పల్సర్‌ యూనిట్లను వాడుతున్నాయి. దీన్ని మార్చాలని విడదీస్తే మళ్లీ కొత్త పరికరాన్ని వేసుకోవాల్సిందే. అయినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రకం మోసాలపై అధికారులు 36 కేసులు నమోదు చేసి, రూ.3 లక్షలు అపరాధం విధించారు.

బంగారం తూకాల్లో మోసాలను నియంత్రించేందుకు ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతికతతో కూడిన మైక్రోస్కోప్‌ ఫోకస్‌ ఎక్స్రే ఫ్లోరోసెస్స్‌ యంత్రం ఆధారంగా ఆభరణం స్వచ్ఛతతోపాటు అందులో కలిసిన ఇతర లోహాల స్థాయి, అమర్చిన రాళ్ల బరువునూ లెక్కలతో సహా చెప్పి బిల్లు ఇస్తుంది. త్వరలో నగరానికి ఈ యంత్రం రానుంది.

తూనికలు–కొలతల శాఖ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ముద్రలు వేశాక ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు (వీసీ), ప్యాకింగ్‌ లైసెన్సులు, కాటాల తయారీ లైసెన్సులు, మరమ్మతుల డీలర్ల లైసెన్సుల ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లోనే.

గ్యాస్‌ బండారం

గ్యాస్‌ సిలిండర్లపై ముద్రితమైన బరువు తప్ప.. వాస్తవంగా ఎంత ఉందో అంచనా ఉండదు. వినియోగదారుడి ఎదుట బరువు తూ.చ. తప్పక అందించాలన్న నిబంధన అమలు కావడంలేదు. ప్లాంట్ల స్థాయి నుంచే మోసాలుంటున్నాయి. ఎల్పీజీ సిలిండర్లలో మోసాలపై గతేడాది 10 కేసులు నమోదుకాగా రూ.1.93 లక్షల అపరాధ రుసుమును వసూలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
పచ్చ‘ప్రళయం’
1
1/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
2
2/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
3
3/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
4
4/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
5
5/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
6
6/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
7
7/8

పచ్చ‘ప్రళయం’

పచ్చ‘ప్రళయం’
8
8/8

పచ్చ‘ప్రళయం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement