
‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’ను విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సుమత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవం గా ప్రకటించిందన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో ప్రతి నెలా ఒక ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం (ఎస్‌ఏఎస్‌ఏ) ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతిగృహాలు, అంగన్‌వాడీ తదితర కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. నిత్య జీవితంలో స్వచ్ఛత భాగం కావాలన్నారు. స్వచ్ఛత ప్రాముఖ్యతను తెలిపేలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖలో కార్యక్రమాలు నిర్వహించి, వివరాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రయాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment