వరసిద్ధుని సేవలో జిల్లా ప్రత్యేక అధికారి
కాణిపాకం : జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా జిల్లా ప్రత్యేక అధికారి కె. వి.ఎన్ చక్రధర్ బాబు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి.విద్యాదరితో కలసి శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారి తొలుత ఆలయ అతిథి గృహానికి చేరుకోగా ఆలయ ఈఓ పెంచల కిశోర్ స్వా గతం పలికారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం జిల్లా ప్రత్యేక అధికారికి వేద పండితులు వేద ఆశీర్వాదం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్తూరు ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఐరాల తహశీల్దార్ మహేష్ కుమార్, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, రవీంద్ర బాబు పాల్గొన్నారు.
జిల్లాకు ‘పది’ పరీక్షల అబ్జర్వర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శ్రీపదిశ్రీ పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు అబ్జర్వర్‌గా నియమితులైన జ్యోతిర్మయి శనివారం జిల్లా కేంద్రానికి వచ్చారు. విశాఖపట్టణం డైట్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెను జిల్లా పదో తరగతి పరీక్షల అబ్జర్వర్‌గా నియమించారు. ఆమె మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్1వ తేదీ వరకు పది పరీక్షలను పర్యవేక్షిస్తారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలను ఆదివారం చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.
అక్రమ గ్రానైట్‌కు రూ.16.91 లక్షల జరిమానా
శాంతిపురం : అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తూ పట్టుబడిన నాలుగు లారీలకు రూ16,91,866 జరిమానా విధించినట్లు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. ఈనెల 5న కృష్ణపట్టణం ఓడ రేవుకు రవాణా అవుతున్న 4 లారీలను కుప్పం–మదనపల్లి జాతీయ రహదారిపై మొరసనపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి మైన్స్, కమర్షియల్ ట్యాక్స్, రవాణా శాఖలకు సమాచారం అందివ్వడంతో ఆయా శాఖల అధికారులు గ్రానైట్ బ్లాకులను పరిశీలించి జరిమానాలను ఖరారు చేశారు. గనులు, భూగర్భ వనరుల శాఖ రూ 9,92,066, వాణిజ్య పన్నుల శాఖ రూ.3 లక్షలు, రవాణా శాఖ రూ 3,99,800 జరిమానా విధించాయని ఎస్‌ఐ చెప్పారు. అక్రమ రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
వరసిద్ధుని సేవలో జిల్లా ప్రత్యేక అధికారి
Comments
Please login to add a commentAdd a comment