ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

Published Sun, Mar 16 2025 1:55 AM | Last Updated on Sun, Mar 16 2025 1:51 AM

ప్లాస

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్రైవేటు ఆస్పత్రులపై దాడులు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని అడిషనల్‌ డైరెక్టర్‌ ఆదేశించారు.

ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025

కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్‌ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్‌ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాణిపాకం : ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్‌ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్‌ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు.

చదువులపైనే దృష్టి పెడుతున్నారు..

ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్‌ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు.

వంట చేయడం రాదు

పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్‌ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్‌ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్‌ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్‌ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కొత్త జంటలకు వంట కష్టాలు

ఆన్‌లైన్‌లో ఆర్డర్ల వెల్లువ

వంట గదిని ముట్టుకోని వైనం

కొందరు యూట్యూబ్‌ ద్వారా వంట పాఠాలు.. ఇంకొందరికి పని ఒత్తిళ్లు

పాస్ట్‌ ఫుడ్‌కు రుచి మరిగిన వైనం

వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

ఫాస్ట్‌ ఫుడ్‌కు జై కొడుతున్నారు

దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్‌ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్‌ చూసి వండిన ఆ టేస్ట్‌ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్‌ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్‌ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్‌లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి.

ఏడాది కిందట పైళ్లెన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.

బయట ఫుడ్‌ డేంజర్‌..?

అధికంగా బయట ఫుడ్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, క్యాన్సర్‌, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు.

రిజిస్ట్రర్‌ కార్యాలయంలో జరిగిన పెళ్లిళ్ల వివరాలు

2022 2568

2023 4019

2024 4214

2025 1638

హోటళ్ల వివరాలు

హోటళ్లు 73

రెస్టారెంట్‌లు 395

క్యాంటీన్లు 98

దాబాలు 56

అనారోగ్యం పాలుకావద్దు

ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్‌ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి.

– వెంకట ప్రసాద్‌, వైద్య నిపుణుడు, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 1
1/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 2
2/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 3
3/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 4
4/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 5
5/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 6
6/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 7
7/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు 8
8/8

ప్లాస్టిక్‌ కవర్లు వద్దు.. కాటన్‌ బ్యాగులే ముద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement