కాణిపాకంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ | - | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Published Sun, Mar 16 2025 1:55 AM | Last Updated on Sun, Mar 16 2025 1:51 AM

కాణిప

కాణిపాకంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని శనివారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హర్షవర్ధన్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారిని కలిసిన ఇంచార్జి కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్‌ బాబును ఇంచార్జి కలెక్టర్‌ విద్యాధరి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో ఆయనను కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పర్యవేక్షణకు నియమితులైన జిల్లా ప్రత్యేక అధికారి పలు ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలను పరిశీలించనున్నారు. అనంతరం జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ఇంచార్జి కలెక్టర్‌ ఆయనకు వివరించారు.

‘పది’ పరీక్షలకు అంతరాయం లేని కరెంటు

చిత్తూరు కార్పొరేషన్‌ : ‘పది’ పరీక్షలకు అంతరాయం లేని కరెంటు సరఫరా ఇవ్వాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. శనివారం అర్బన్‌ డివిజన్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేసవికి కరెంటు కోతలు లేకుండా ముందుస్తుగా 11 కేవీ లైన్లను సర్వే చేయాలన్నారు. లైన్‌కు అడ్డంగా ఉన్న తీగలను తొలగించి, వదులుగా ఉన్న వైర్లను బిగుతుగా చేయాలన్నారు. సెక్షన్ల వారీగా లోడ్‌ మానిటరింగ్‌ చేసి ఎక్కడెక్కడ ఓవర్‌లోడ్‌ ఉందో గుర్తించాలన్నారు. చిత్తూరులో 160 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు 4, బంగారుపాళ్యం 2, నగరిలో 2 అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లు పెడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, జగదీష్‌, ఏఓ ప్రసన్న ఆంజనేయులు, డీఈలు ప్రసాద్‌, ఆనంద్‌, కొండయ్య, ఏఏఓ గీత, ఏఈలు, సబ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో ఒత్తిడిని పోగొట్టాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో నియమితులైన హెల్త్‌ కౌన్సిలర్‌లు విద్యార్థుల్లో ఒత్తిడిని పోగొట్టేలా దృష్టి సారించాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. శనివారం డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హెల్త్‌ కౌన్సిలర్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షలంటే భయం, తీవ్ర ఒత్తిడి, మానసిక, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడే విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ఏడుగురు హెల్త్‌ కౌన్సిలర్‌లను నియమించారన్నారు. జిల్లాలో నియమితులైన హెల్త్‌ కౌన్సిలర్‌లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో సమగ్రశిక్ష శాఖ గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఇంద్రాణి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కాణిపాకంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ 
1
1/1

కాణిపాకంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement