ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు 856 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 118 కేంద్రాల్లో తొలిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తెలుగు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి పరీక్షకు మొత్తం 20,746 మంది విద్యార్థులకు గాను 19,890 మంది హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 856 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఈ క్రమంలోనే పలు పరీక్ష కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరి, డీఈఓ తనిఖీ చేశారు.
అమలు కాని నిబంధనలు
నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్,నెట్ సెంటర్లను పరీక్ష పూర్తయ్యే వరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్‌తెరిచే ఉంచారు. ఇదే విధంగా జిల్లాలోని పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, పుంగనూరులెఓ పలు జిరాక్సు సెంటర్లు మూత పడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment