మాతాశిశు సంరక్షణకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మాతా శిశు సంరక్షణను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆశా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గర్భిణుల సేవలు పక్కాగా అమలు కావాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. మాతా శిశు సంరక్షణకు కృషి చేయాలన్నారు. నిత్యం తల్లులతో పాటు పిల్లలను పర్యవేక్షణలో ఉంచాలన్నారు. క్రమం తప్పకుండా టీకాలు అందించాలన్నారు. ఎన్‌సీడీ సర్వేను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు అనూష, ప్రవీణ, రామ్మోహన్, మూర్తి పాల్గొన్నారు.
రేపటి నుంచి వార్షిక తనిఖీ
చిత్తూరు కార్పొరేషన్ : ట్రాన్స్‌కో పరిధిలోని డివిజన్ కార్యాలయాల నందు సాధారణ వార్షిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 20న పుంగనూరు డివిజన్ కార్యాలయం, 21 చిత్తూరు అర్బన్ డివిజన్, 22న చిత్తూరు రూరల్ డివిజన్ కార్యాలయాల్లో తనిఖీలు ఉంటాయన్నారు. 25న ఎంఆర్‌టీ జిల్లా కార్యాలయంలో పరిశీలన నిర్వహించనున్నారు. ఎస్‌ఈ, టెక్నికల్ ఈఈ, పీఓ, ఏఓల బృందం ఫైల్స్, సబ్ స్టేషన్ల సరఫరా, ట్రిప్పింగ్ ఫైళ్లను పరిశీలించనున్నారు.
పల్లెలపై నిఘా పెట్టాలి
కుప్పం రూరల్ : అటవీ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారిణి ఎస్.ధరణి ఆదేశించారు. మంగళవారం అట వీ సిబ్బంది యూనిఫామ్, షూ, బెల్టు, క్యాప్ లు, టార్చ్‌లైట్లు, అగ్ని నిరోధక పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏనుగులు అటవీ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సున్నితంగా మెలగాలని సూచించా రు. ముందస్తు రైతులకు సమాచారం ఇచ్చి పొలాల వైపునకు రాకుండా నిత్యం నిఘా ఉంచాలన్నారు. వేసవిలో ఎక్కడా అడవిలో మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేంజర్ జయశంకర్, సిబ్బంది ఉన్నారు.
ఎస్‌పీఎంలో పోలీసుల విచారణ
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌ఫార్మర్ కష్టాలు పేరిట సాక్షి పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మంగళవారం ఈ మేరకు ట్రాన్స్‌కో ఏపీటీఎస్ (యాంటీ పవ ర్ తెఫ్ట్ స్క్వాడ్) పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు లోని ఎస్‌పీఎం (ట్రాన్స్‌ఫార్మర్ల మర మ్మతు కేంద్రం)ను పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. నూతన ఓఆర్‌ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇన్‌స్టాల్ చేయలేదు..? టెక్నీషియన్లు ఎందుకు రావడం లేదు...? వారంటీ గడువు ఎంత కాలం ఉంది..? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో మిషన్ అందుబాటులో ఉంటే ఉపయోగాలు ఏంటీ..? ఎప్పుడు మిషన్‌ను ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది..?అనే విషయాలపై చర్చించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
జేసీకి సావనీరు అందజేత
చిత్తూరు కలెక్టరేట్ : అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహస్థాపనను పురస్కరించుకుని ముద్రించిన పుస్తకం (సావనీరు)ను ఆ కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ విద్యాధరికి అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆ విగ్రహ కమిటీ సభ్యులు జేసీని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆ కమిటీ సభ్యులు చిత్తూరు నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై జేసీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో విగ్రహస్థాపన కమిటీ సభ్యులు కట్టమంచి బాబీ, అమర్‌నాథ్, సహదేవ నాయుడు, అరుణకుమారి, రమేష్, శ్రీహరి పాల్గొన్నారు.
మాతాశిశు సంరక్షణకు కృషి
మాతాశిశు సంరక్షణకు కృషి
Comments
Please login to add a commentAdd a comment