రేడియోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తుకు గడువు పెంపు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్‌లోని రేడియోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీసీహెచ్‌ఎస్ ప్రభావతీదేవి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ మేరకు దరఖాస్తులను ఈనెల 24వతేది వరకు స్వీకరించనున్నటువెల్లడించారు. అయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్టును జాబితా నుంచి తొలగించినట్లు వివరించారు.
రీసర్వే పకడ్బందీగా చేయాలి
పూతలపట్టు (కాణిపాకం) : రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని స్టేట్ నోడల్ ఆఫీసర్ గోవిందరావ్ ఆదేశించారు. పూతలపట్టు మండలం వడ్డెపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద జరుగుతున్న రీసర్వేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రీసర్వే జరుగుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే విషయాన్ని ముందుగానే భూయజమానులకు తెలియజేయాలన్నారు. రీసర్వేకు రాకుంటే నోటీసులు ఇవ్వాలని చెప్పారు. సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ జయరాజు, రీ సర్వే డీటీ మునిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment