ఇసుక నిల్వలు సీజ్
పాలసముద్రం : నరసింహపురం జగనన్న కాలనీ సమీపంలో డంప్ చేసిన ఇసుకను మంగళవారం ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప సీజ్ చేసి తహసీల్దార్ అరుణకుమారికి అప్పగించారు. ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ.. నరసింహపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలో అనుమతి లేకుండా 15 లోడ్‌ల ఇసుక నిల్వలు ఉన్నాయని ఫిర్యాదు వచ్చిందన్నారు. వెంటనే వీఆర్‌ఓ రమేష్ సిబ్బందితో వెళ్లి ఇసుక నిల్వలను సీజ్ చేసి తహసీల్దార్‌కు అప్పగించామని తెలిపారు.
నేటి నుంచి జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ క్యాంప్‌లను నిర్వహించనున్నారు. ఈ క్యాంప్‌లను జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. జిల్లాలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. ఆరేళ్ల వయస్సు లోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్‌కార్డు నమోదు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment