కాన్పులన్నీ విధిగా నమోదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అన్ని కాన్పులను విధిగా నమోదు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతీదేవి ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్‌హోమ్‌ల్లో జరిగే కాన్పుల సంఖ్యను విధిగా హెచ్‌ఎంఐఎస్, సీఆర్‌ఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జనన లెక్కలో తప్పిదాలు ఉండకూడదన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రులదేనన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
పార్కింగ్ ఫీజు వేలం
రూ. 2.12 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలో బుధవారం పార్కింగ్ ఫీజు వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను కాణిపాకం గ్రామ పంచాయతీ, దేవస్థానం సంయుక్తంగా నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.12కోట్ల వరకు పలికింది. కాణిపాకానికి చెందిన ఆర్.సెల్వం పార్కింగ్ ఫీజు హక్కును కై వసం చేసుకున్నారు. ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆలయ అధికారులు, వేలం పాటదారులు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు విద్యార్థికి గేట్ జాతీయ స్థాయి ర్యాంకు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు చెందిన విద్యార్థి వర్షిత్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ఫలితాల్లో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు. ఈ నెల 19వ తేదీన గేట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లాలోని యాదమరి మండలం కే.గొల్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సుధాకర్, అదే మండలంలో దళవాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమారుడు వర్షిత్ గేట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 13 స్థాయి ర్యాంకు సాధించాడు.
25న ప్రసన్నుడి కల్యాణోత్సవం
తిరుపతి కల్చరల్ : అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 25వ తేదీన స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.
కాన్పులన్నీ విధిగా నమోదు
Comments
Please login to add a commentAdd a comment