వ్యాపారికి నైవేద్యం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారికి నైవేద్యం

Published Thu, Mar 20 2025 1:57 AM | Last Updated on Thu, Mar 20 2025 1:53 AM

వ్యాప

వ్యాపారికి నైవేద్యం

కర్షక కష్టం..

అసలే వేసవి కాలం.. దిగుబడి అంతంత మాత్రం.. అదీ మార్కెట్‌కు తెచ్చేందుకు ఎనలేని కష్టం.. దక్కని సరైన ఫలితం.. పోనీ వినియోగదారుడికై నా చౌకధరలంటే అదీ లేని వైనం.. ఎందుకీ దుస్థితి అంటే రైతు సొంతంగా విక్రయించుకోలేని బలహీనత ఆసరాగా మండీ వ్యాపారి, దళారీ ఇష్టారాజ్యం.. అదే సరుకు తిరిగి కొనాలన్నా రెట్టింపు వ్యయం.. వెరసి.. పుడమి పుత్రుడికి మిగులుతోంది నష్టం.. వ్యాపారి, దళారీకి కురుస్తున్న కాసుల వర్షం.. ఇదీ జిల్లాలోని రైతులు దుస్థితి.

ఇదీ రైతులు, వ్యాపారులకున్న ధరల్లో తేడా...

కూరగాయ రైతుకు రీటైల్‌గా వ్యత్యాసం

పేరు దక్కే ధర ధర (రూపాయిల్లో)

టమాట 10 20 10

బంగాళాదుంప 12 22 10

క్యాబేజీ 02 12 10

బెండ 18 28 10

కాకర 20 40 20

దోస 15 25 10

బీన్స్‌ 20 40 20

చిక్కుడు 25 40 15

వంగ 20 40 20

పచ్చిమిరప 15 40 25

ముల్లంగి 03 15 12

కొత్తిమీర కట్ట 05 10 05

కందులు 40 60 20

అలసంద 45 80 35

మునగ 30 60 30

బీర 15 60 45

మొక్కజొన్న 10 20 10

పలమనేరు: పలమనేరులో టమాట సాగు చేసిన రైతులు ఇక్కడి మార్కెట్‌కు వెళ్లి టమాట కిలో రూ.10 లెక్కన విక్రయిస్తున్నారు. అదే టమాట మార్కెట్‌ బయట రిటైల్‌గా బండిపై వ్యాపారి కిలో రూ.20కి అమ్ముతున్నాడు. కేవలం గంటల వ్యవధిలోనే రైతుకు వ్యాపారికి మధ్య కిలోకు రూ.10 వ్యత్యాసం వస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆరుగాలం కష్టపడి పంటసాగు చేసి రైతు కంటే గంటల్లో సరుకును కొన్న దళారులు, మండీ వ్యాపారులు బాగుపడుతున్నారేగానీ రైతుకు మిగిలిందేమీ లేదన్నట్టుగా మారింది. జిల్లాలో కూరగాయల సాగుచేసే రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా మారింది.

భారీగా పంట పెట్టుబడులు

జిల్లాలోనే కూరగాయల సాగులో పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌ ముందంజలో ఉంది. ఇక్కడ ఏటా పలు రకాల కూరగాయల సాగు 50 వేల హెక్టార్లుగా ఉంటుంది. సుమారు 30 వేల మంది రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా టమాట పంటను ఎకరా సాగు చేయాలంటే పంట పెట్టుబడిగా రూ.2 లక్షలు, బంగాళాదుంపకు రూ.2 లక్షలు, బీన్స్‌కు రూ.లక్ష, ఇతర పంటలకు ఎకరానికి రూ.50 వేలుగా సగటున పెట్టుబడి పెట్టాల్సివస్తోంది.

అమ్మాలంటే తక్కువ.. కొనాలంటే ఎక్కువ

జిల్లాలో రైతులు అమ్మే ధరలకు, బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణమేమిటంటే రైతు పండించిన ధరను మార్కెట్‌కు తీసుకెళితే అక్కడ పదిశాతం కమీషన్‌ పెట్టుకుని మండీ వ్యాపారులు కొంటారు. దానిపై లాభం పెట్టుకుని హోల్‌సేల్‌ వ్యాపారికి అమ్ముతారు. వారి వద్ద నుంచి అధిక ధరకు కొనే రీటైల్‌ వ్యాపారులు వారి లాభం పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. కిలో రూ.10కి టమాట అమ్మిన రైతు అదే టమాటను ఇంటికి కొనాలంటే రూ.20 ఇచ్చి కొనాల్సిందే.

గంటల వ్యవధిలోనే మారిపోతున్న కూరగాయల ధరలు

దళారులు, మండీవ్యాపారులు, రీటైల్‌ వ్యాపారులు మేలు

ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు దక్కని గిట్టుబాటు

ఇదీ జిల్లాలోని కూరగాయల కర్షకుల పరిస్థితి

పంట వ్యాపారుల పాలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లభించడంలేదు. మేము మార్కెట్‌లో అమ్మిన కూరగాయలనే మళ్లీ మార్కెట్‌లో కొనాలంటే రెట్టింపు ధర పెట్టి కొనాలి. దీనిపై ప్రభుత్వం గానీ, మార్కెటింగ్‌ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఇలా అయితే రైతులు అప్పులపాలు కావాల్సిందే. గంటల వ్యవధిలో మా సరుకును కొన్న మండీవ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు లాభాలు గడిస్తున్నా, కష్టపడిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదే.

– అమరనాథ్‌ రెడ్డి, రైతు, చిన్నపరెడ్డిపల్లి, గంగవరం మండలం

గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి

అన్ని రకాల ఉత్పత్తులకు గ్యారెంటీ ధరలుంటాయి. వాటిపై ఎంత ఎమ్మార్పీ ఉంటే అంతే ఇచ్చి జనం కొనుగోలు చేయాలి. అదే రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మాత్రం కనీస మద్దతు ధరలుండవు. రైతంటే అందరికీ అలుసుగా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులకు మేలు చేయాలనే తలంపు లేకుండా పోతోంది. ఫలితంగా రైతులు కష్టాల్లో పుట్టి, కష్టాల్లో పెరిగి, కష్టాల్లోనే చస్తున్నారు.

– ఉమాపతి నాయుడు, రైతుసంఘ నాయకులు, పలమనేరు

No comments yet. Be the first to comment!
Add a comment
వ్యాపారికి నైవేద్యం
1
1/3

వ్యాపారికి నైవేద్యం

వ్యాపారికి నైవేద్యం
2
2/3

వ్యాపారికి నైవేద్యం

వ్యాపారికి నైవేద్యం
3
3/3

వ్యాపారికి నైవేద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement