ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోిసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై, సంఘం అభివృద్ధిపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన నాడు–నేడు పనులను కొనసాగించాలన్నారు. పాఠశాలలు మూతపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడితే ఆందోళనలు తప్పవన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంపై పోరాడేందుకు తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. టీచర్లకు విడుదల చేయాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. క్లస్టర్ సమావేశాల్లో, సీనియారిటీ జాబితాల ప్రక్రియలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సూచనలను స్వీకరించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment