ఇలవైకుంఠం.. ఇదేం అపచారం
వేంకటాద్రి నిలయం.. పరమ పవిత్రం..భక్తికి.. ముక్తికి..ఆధ్యాత్మికత క్షేత్రం..కలియుగ వైకుంఠవాసుడు కొలువైన ఇలవైకుంఠంగా పేరుగాంచిన పుణ్యస్థలం..ఇంతటి ప్రాధాన్యం శేషాచలంపై భక్తులు ఎంతో భక్తిభావంతో ప్రవర్తిస్తారు. అందుకే ఇక్కడ మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, పానీయాలకు చోటు లేదు. ఇక్కడంతా ఆధ్యాత్మిక చింతనే కనిపిస్తుంది. అయితే కాల‘కూటమి’ అధికారంలోకి వచ్చింది. తిరుమలలో అపవిత్రత రాజ్యమేలుతోంది. నిత్యం మందుబాబులు చిందులేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలవైంకుంఠంలో ఇదేం రచ్చ అని ఆవేదన చెందుతున్నారు.
తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో తిరుమలలో మాంసం, మత్తు పదార్థాలు, పానీయాలపై టీటీడీ నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, భక్తులకు భక్తిభావాన్ని పెంపొందించేలా అనేక చర్యలు అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాగానే తిరుమలలో మందుబాబులకు అడ్డా గా మారింది. రోజుకో ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. తిరుమలలో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పీకలుదాక మద్యాన్ని సేవించి తిరుమలలో హల్‌చల్ చేస్తున్న ఘటనలు అనేకం. శ్రీవారి ఆలయానికి సమీపంలోని శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో ఓ మహిళా భక్తురాలిపై దుసురుగా, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తిరుమలలో మద్యం ఎంత కావాలన్నా సేవిస్తానని, ఎంత మద్యం కావాలో చెప్పు.. నీకు తెచ్చిస్తాం అంటూ ఊగిపోయాడు. పోలీసులకు కావాలంటే కూడా అమ్ముతా అంటు రెచ్చిపోయాడు. ఆ విషయం విజిలెన్స్ కానిస్టేబుల్‌కి సైతం తెలుసు అంటూ విర్రవీగాడు. వెంటనే అక్కడికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
నిద్ద్దురోతున్న నిఘా
టీటీడీ నిత్యం మూడంచెల భద్రత నడుమ నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. భక్తుల రక్షణ, శ్రీవారి ఆలయ భద్రత నిర్వహణను టీటీడీ విజిలెన్‌న్స్, స్టేట్ పోలీస్, ఎస్బీ, విజిలెన్స్ వింగ్, ఇలా అనేక విభాగాలు తిరుమలలో నిత్యం పహారా కాస్తుంటాయి. తిరుపతి నుంచి మద్యం తిరుమలకు రాకుండా అలిపిరిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా వారి కళ్లుగప్పి తనిఖీలను దాటుకుని తిరుమలకు చేరుకుంటున్నారు. పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు భద్రత ప్రమాణాలు చేపడుతుంటే.. సీవీఎస్వో, వీజీఓ, ఏవీఎస్వో, వీఐ, ఇతర అదనపు సిబ్బంది ఆలయ భద్రతతో పాటు భక్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు.
గంజాయి మత్తులో భక్తులపై దాడి
ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో డీ టైప్ క్వార్టర్స్ వద్ద హల్‌చల్ చేశారు. మేము లోకల్.. మమల్ని ఏమీ చేయరంటూ అనధికార వ్యక్తులు జానాల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ భక్తులపై దాడికి దిగారు. ఓ భక్తుని తలపై బలమైన ఆయుధంతో మోది గాయాలపాలు చేశారు.
తిరుమలలో మందుబాబులు హల్‌చల్
నియంత్రించలేకపోతున్న విజిలెన్స్, పోలీస్
అడ్డదారిలో తిరుమలకి మద్యం
తిరుమలలో యథేచ్ఛగా అక్రమ మద్యం
తిరుమలలో చిన్న గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు యథేచ్ఛగా దొరుకుతున్నాయి. భారీ స్థాయిలో మత్తు పదార్థాలను నిఘా కళ్లు గప్పి తిరుమలకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గం మీదుగా కొంతమేర అక్రమార్కులు తనిఖీ సిబ్బంది కళ్లు గప్పి తరలిస్తుంటే.. మరి కొంతమంది మామండూరు, అన్నమయ్య నడక మార్గాల మీదుగా తిరుమలకు అక్రమ మద్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో సరైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయక పోవడంతోనే మద్యం సరఫరా అవుతున్నట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు.
తిరుమలలో ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తుంది?
తిరుమలలో ఎకై ్సజ్ శాఖ సీఐ స్థాయి అధికారితో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఈ శాఖ పనితీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. తిరుమలలో ఎకై ్సజ్ పోలీసులు ఉన్నారా? లేదా అన్న అనుమానం సైతం భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే కారణం. తిరుమలలో ఎకై ్సజ్ ప్రోహిబిషన్ విభాగం అధికారులు తిరుమలలో అక్రమ మద్యం, ఇతర మత్తుపదార్థాలను గుర్తించి సీజ్ చేయా ల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏ విభాగం అధికారులు తిరుమలలో అక్రమ మద్యం, గంజాయి విక్రయాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. అలాగే ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు సైతం నిర్వీర్యంగానే కనిపిస్తున్నాయి. తిరుమలలో ఎకై ్సజ్ పోలీసులు ఉన్నా కూడా లేనట్లే అని భక్తులు వాపోతున్నారు.
ఇలవైకుంఠం.. ఇదేం అపచారం