ఇంతకీ ఎవరీ అబ్బాయి!
● 2 నెలలుగా రిమ్మర్స్ స్కూల్‌లోనే..
పలమనేరు : ఎవరి బిడ్డో తెలియదు.. ఏ ఊరో చెప్పడం లేదు. ఎలాంటి వివరాలు నోట రావ డం లేదు. మూడు నెలల కిందట పలమనేరు మండలంలోని బేరుపల్లిలో మూతబడిన ప్రభుత్వ బడి వద్ద ఉంటుంటేవాడు. గమనించిన స్థానికులు ఆ 22 ఏళ్ల అబ్బాయి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నించినా లాభం లే కుండా పోయింది. దీంతో గ్రామస్తులు అతడిని రెండు నెలల కిందట పట్టణ సమీపంలోని నడింపల్లి వద్ద గల రిమ్మర్స్ బుద్ధిమాంద్యం గల పాఠశాలలో చేర్పించారు. బుద్ధి మాంద్యం కారణంగా తానెవరో చెప్పలేకపోతున్నాడు. కానీ అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్లవచ్చునని స్కూల్ నిర్వాహకులు తనూజ తెలిపారు. ఇతర వివరాల కోసం 98850 40345 అనే నంబరును సంప్రదించాలని సూచించారు.
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?
పలమనేరు : కూటమి నేతలు ఎలాంటి అక్రమాలు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. అదే వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏ చిన్న తప్పు చేసిన ఆఘమేఘాలపై వేధింపులకు దిగుతున్నారు. ఇది కొన్నాళ్లుగా పలమనేరులో అధికారుల తీరు. వివరాలు ఇలా..బొమ్మిదొడ్డికి చెందిన సుబ్రమణ్యంనాయుడు ఇంటి వెనుక పశువులను కట్టేసుకునేందుకు కొంత మేర చెరువు స్థలంలో రేకుల షెడ్డు వేశాడు. దీనిపై పచ్చనేతల సమాచారంతో స్థానిక రెవెన్యూ అధికారులు హుటాహుటిన గురువారం షెడ్డును జేసీబీతో తొలగించేశారు. ఇదే విధంగా అక్కడే చెరువు స్థలాన్ని ఆక్రమించుకున్న కూటమి నేతల జోలికెళ్లకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. కూటమి నేతలకు అయితే నిబంధనలకు చెల్లుచీటీ పాడుతున్నారు. వేరే పార్టీకి అయితే నిబంధనల పేరుతో వేధింపులకు దిగుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టపగలే చైన్ స్నాచింగ్
● యువతి మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు
నగరి : నగరి మున్సిపాలిటీ తిరుపతి రోడ్డు 7కే క్రికెట్ టర్ఫ్ పక్కనే ఉన్న వీధిలో పట్టపగలే గుర్తుతెలి యని వ్యక్తులు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భార్గవి తెలిపిన వివరాల మేరకు. గుండ్రాజుకుప్పంకు చెందిన ఆమె నగరి పట్ణణంలోని బ్యాంకులో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ పనిముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు ఆటోలో కొంత దూరం మరో మహిళతో కలిసి 7 కే క్రికెట్ టర్ఫ్ వద్దకు చేరుకొంది. అక్కడి నుంచి ఇద్దరూ స్వగ్రామానికి నడుచుకుంటూ బయలుదేరారు. అప్పటికే ఇద్దరు హెల్మెట్ వేసుకొని దారిపక్కనే ఆగి ఉన్నారు. వారిని పట్టించుకోకుండా నడుస్తూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వీరిని దాటుకొని ముందుకెళ్లినవారు కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో తిరిగీ ఎదురుగా రాగా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి భార్గవి మెడలోని బంగారు గొలుసును పట్టుకొని లాక్కెళ్లాడు. లాక్కెళ్లిన సరడు, తాళిబొట్టు, కాసులతో కలిపి సుమారు 3 సవరాలని బాధితురాలు వాపోయింది. కాగా వారు బైక్‌లో వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా సీఐ విక్రమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక అదృశ్యం
పుంగనూరు : మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యం అయింది. గురువారం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు
ఇంతకీ ఎవరీ అబ్బాయి!
ఇంతకీ ఎవరీ అబ్బాయి!
Comments
Please login to add a commentAdd a comment