తప్పిన పెను ప్రమాదం
● టైర్ పంచర్‌తో ఉల్కిపడ్డ ప్రయాణికులు ● ఊపిరి పీల్చుకున్న స్థానికులు
కార్వేటినగరం : చిత్తూరు నుంచి పుత్తూరుకు వస్తున్న బస్సు గురువారం కార్వేటినగరం సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున శబ్ధంతో పాటు దుమ్ములేచి పోవడంతో బస్సులోని ప్రయాణికులతో పాటు, స్థానికులు ఉల్కిపడ్డారు. అక్కడ ఏం జరిగిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. ప్రయాణికులు భయబ్రాంతులకు గురై బస్సు నుంచి దిగారు. తీరా చూస్తే బస్సు ముందు టైర్ పంచర్ అయినట్లు డ్రైవర్ గుర్తించారు. అయితే 5 అడుగుల దూరంలో పెద్ద కల్వర్టు ఉంది. అలాగే అదే ప్రాంతంలో 33 కేవీ విద్యుత్ స్తంభం ఉండటంతో మరింత భయ బ్రాంతులకు గురయ్యారు. టైర్ పంచర్ అయిన విషయాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా బస్సును రోడ్డు వైపు మళ్లించి ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులతో పాటు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు నాణ్యమైన టైర్లతో బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment