అటవీ చట్టాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

అటవీ చట్టాలపై అవగాహన

Published Sat, Mar 22 2025 12:27 AM | Last Updated on Sat, Mar 22 2025 12:28 AM

అటవీ

అటవీ చట్టాలపై అవగాహన

అటవీ చట్టాలపై అధికారులకు పూర్తి అవగా హన అవసరమని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డీఎఫ్‌ఓ వివరించారు.

శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025

చిత్తూరు అర్బన్‌ : కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఖాకీ యూనిఫామ్‌పై చల్లిన బురదను కడుక్కోవడానికి జిల్లాలో ఏక పక్షంగా 264 మంది పోలీసులు బదిలీ అయ్యారు. కాగా వేల మంది పోలీసుల పనులు చేసే జిల్లా పోలీసు కార్యాలయంలో గాడితప్పిన కొందరు మినిస్టీరియల్‌ సిబ్బందిని దారిలో ఎవరు పెడతారు..? ఇన్‌స్పెక్టర్ల వద్ద డ్రైవర్‌ డ్యూటీ చేస్తూ ఆర్థిక పనులు చక్కబెడుతున్న వాళ్లకు బదిలీ ఉండదా..? డీఎస్పీల వద్ద తిష్ట వేసిన తిమింగలాల అక్రమాలకు కళ్లెం వేయలేరా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డీపీవోపై పట్టు అవసరం..

వేల మంది పోలీసులు స్టేషన్‌లో.. రోడ్లపై డ్యూటీలు చేయడం కనిపిస్తూనే ఉంటుంది. రూ.వంద లంచం తీసుకున్న వాళ్లను నిర్దాక్షణ్యంగా సస్పెండ్‌ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఆరోగ్యం బాగోలేక మెడికల్‌ లీవు పెట్టుకున్న కానిస్టేబుల్‌.. తన పెండింగ్‌ వేతనం కోసం డీపీవోకు వెళ్లాలి. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)పై రుణం తీసుకుంటే తప్ప పిల్లాడి చదువు కొనసాగించలేని వాళ్లు, ఎనిమిదేళ్లకోసారి వచ్చే ఇంక్రిమెంటును సకాలంలో ఇవ్వకపోవడంతో.. దాని బకాయిల కోసం తిరిగే సీనియర్‌ పోలీసులు, కమిటేషన్‌ లీవుల కోసం సీటు.. సీటుకు సెల్యూట్‌ కొట్టి నెలల పాటు తిరిగే హెడ్‌కానిస్టేబుళ్లు.. వీళ్లందరినీ ఒకే చోట చూడాలంటే అది జిల్లా పోలీసు కార్యాలయమే.

అటాచ్‌మెంట్‌ పేరుతో..

పోలీసుల సంక్షేమ కోసం పనిచేసే డీపీవోలో ఒక్క రూపాయి తీసుకుంటే పాపమని భావించే నిర్ణీత గడువుకన్నా ముందుగా పనులు పూర్తిచేసే మినిస్టీరియల్‌ సిబ్బంది ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇదే సమయంలో సాటి డిపార్టుమెంటులో పని చేస్తున్న పోలీసులకు సాయం చేయాలన్నా చేతులు చాచే అవినీతి జలగలు కూడా ఇక్కడే కనిపిస్తుంటారు. పరిపాలన కోసం డీపీవోలో ఉన్న మినిస్టీరియల్‌ ఉద్యోగులు చేయాల్సిన పనులు సకాలంలో చేయకపోవడంతో వారికి తోక సాయంగా స్టేషన్‌లో విధులు నిర్వర్తించే పోలీసులను అటాచ్‌మెంట్ల ద్వారా పిలిపించి విధులు చేయించుకోవడం డీపీవోలో సర్వసాధారణమనే విమర్శలున్నాయి. ఇక సిబ్బంది బదిలీల్లో వందల పేర్ల మధ్యలో తమకు కావాల్సిన వ్యక్తుల ఒకటి, రెండు పేర్లను ఇరికించి కోరుకున్న చోటుకి బదిలీ చేయడం, వాళ్ల నుంచి ఆర్థిక భరోసా పొందుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ముందుగా పోలీసు బాసుకు డీపీవోపై పట్టు అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరనే చందంగా.. సాక్ష్యాత్తు జిల్లా పోలీసు కార్యాలయంలో అటాచ్‌మెంట్‌ల పేరుతో ఏళ్లకు తరబడి తిష్టవేసి విధులు నిర్వహిస్తూ.. లంచాలు మరిగిన అవినీతి జలగలను పసిగట్టలేకపోతున్నారు.. ఏళ్లుగా పాతుకుపోయిన కొంత మంది చిన్న స్థాయి ఉద్యోగులు .. ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయిలో వీరు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీటిన్నింటిపై జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రక్షాళన జరగాలని కొంత మంది పోలీసులు సైతం కోరుకుంటుండడం విశేషం.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఫైలుకో రేటు?

మినిస్టీరియల్‌ స్టాఫ్‌ విధులకు.. పీసీల సాయం

సబ్‌–డివిజన్‌ కార్యాలయాల్లోనూ వారిదే హవా

ఐడీ పార్టీ, ఐడబ్ల్యూ, డ్రైవర్ల డ్యూటీల్లో కదలని వైనం

చిత్తూరు పోలీసు శాఖలో మరింత ప్రక్షాళన అవసరమే..

అసాంఘిక కార్యకలాపాలు పోషిస్తూ..

చిత్తూరు వెస్ట్‌ పరిధిలో ఐడీ పార్టీ పేరిట ఓ కానిస్టేబుల్‌ బెట్టింగులను ప్రోత్సహిస్తూ, అసాంఘిక కార్యకలాపాలను తన కనుసన్నల్లో చేయిస్తున్నా అడిగే దిక్కులేదు. ఐడబ్ల్యూ (రైటర్లు) పేరిట పలమనేరు డివిజన్‌లోని ఓ కానిస్టేబుల్‌ ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి వెళ్లేలోపు జేబులో రూ.2 వేలు ఉండాల్సిందే. అయిదేళ్లల్లో మూడు సార్లు ఓ డీఎస్పీ క్యాంపు కార్యాలయాన్నే తన సీటుగా మలుచుకుని సబ్‌–డివిజన్‌ మొత్తం షాడో డీఎస్పీగా పేరొందిన వ్యక్తిని, చిత్తూరులో ఓ సీఐ వద్ద పనిచేసే డ్రైవర్‌ ఫైనాన్స్‌లు ఇస్తూ, సెటిల్‌మెంట్లు చేస్తున్నా ఎవ్వరూ అడగని పరిస్థితి. అసలు ఇన్‌స్పెక్టర్ల వద్ద డ్రైవర్ల రూపంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లను ఎందుకు కదిలించడంలేదని ప్రశ్నిస్తున్నారు.

వారికి బదిలీ ఉండదా..?

పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య ఘటనను కారణంగా చూపిస్తూ జిల్లా పోలీసు శాఖలో జరిగిన బదిలీల పర్వంపై ఖాకీలు రగిలిపోతున్నారు. తమ కడుపుమంట పోసుకున్న కూటమి పార్టీ నేతలకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదే సమయంలో బాసు తీసుకునే నిర్ణయాల వల్ల కలిగే తప్పొప్పులను చెప్పలేకపోతున్న ‘ప్రత్యేక విభాగం’ వాస్తవాలను చెప్పకుండా మౌనం వహించడంపై గుర్రుమంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అటవీ చట్టాలపై అవగాహన
1
1/2

అటవీ చట్టాలపై అవగాహన

అటవీ చట్టాలపై అవగాహన
2
2/2

అటవీ చట్టాలపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement