‘పది’ పరీక్షలకు మోహరించిన అధికారులు
చౌడేపల్లె : స్థానిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో మూడు స్క్వాడ్ బృందాలు శుక్రవారం తనిఖీలు చేపట్టాయి. ‘సాక్షి’లో హిందీ పరీక్షలో మాస్ కాపీయింగ్..? అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు పరీక్షా కే ంద్రం వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్షకు హాజరైన విద్యార్థులను ప్రధాన గేటు వద్ద పోలీసులు, సచివాలయ మహిళా సంరక్షకులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను మాత్రమే లోపలికి తనిఖీ చేసి పంపారు. చిత్తూరు నుంచి అడిషనల్ ఫ్లైయింగ్ స్క్వాడ్‌తో పాటు రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రం ప్రారంభం నుంచి పరీక్షలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అదనపు పోలీసు సిబ్బందిని కేటాయించారు. కాగా మొత్తం 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 8 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షా కేంద్రాన్ని ఎంఈఓ తిరుమలమ్మ, తహశీల్దార్ హనుమంతునాయక్, ఎస్‌ఐ నాగేశ్వరరావు తనిఖీ చేశారు.
రొంపిచెర్లలో కట్టుదిట్టంగా పరీక్షలు
రొంపిచెర్ల : రొంపిచెర్లలో జరుగుతున్న పదో తగరతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టు బిగించారు. నాలుగు రోజుల కిందట బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. దీంతో శుక్రవారం రొంపిచెర్ల బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు పూర్తి అయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ఇంత వరకు కనెక్షన్ ఇవ్వలేదని సమాచారం.
‘పది’ పరీక్షలకు మోహరించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment