ట్రాక్టర్ బోల్తా.. 42 మందికి గాయాలు
శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : ట్రాక్టర్ బోల్తా పడి 42 మందికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని పొదలపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. వెదురుకుప్పం మండలం యనమలమంది గ్రామానికి చెందిన నరసింహులు అత్త గంగాధర నెల్లూరు మండలంలోని అరవచేనుపల్లి గ్రామంలో మృతి చెందడంతో అంత్యక్రియలకు స్థానికులతో కలిసి సుమారు 45 మంది ట్రాక్టర్‌లో తరలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 42 మందికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ద్విచక్రవాహనాలు, కార్లు, వంటి వివిధ వాహనాలలో శ్రీరంగరాజపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో పండమ్మ, బుడిగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పండమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే , ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 45 మందిలో 42 మందికి స్పల్పగాయాలు అయ్యాయని, ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా.. 42 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment