అటవీ చట్టాలపై అవగాహన
చిత్తూరు కార్పొరేషన్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ ప్రాంతంలో పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుక్రవారం నగరవనం ఆవరణలో మొక్కల పెంపకంపై తిరుపతి బయెట్రిమ్ డీఎఫ్‌ఓ నరేంద్రన్ పలు సూచనలు చేశారు. ఎర్ర చందనం చెట్ల ఆవశ్యకత పెరిగే విధానం గురించి తెలిపారు. అలాగే వాటి విత్తనాలను ఎలా సేకరించి నాటాలి, పెంచాలి అనే అంశాల గురించి విపులంగా చెప్పారు. అనంతరం డీఎఫ్‌ఓ భరణి అటవీ ప్రాంతంలో జరిగే పనులకు ఎలా అంచనాలు వేయాలి అనే అంశంపై మాట్లాడారు. పనులు వాటి ప్రతిపాదన, అనుమతి, నిర్మాణాలు, వివరాల నమోదు గురించి ఆమె తెలియజేశారు. అటవీ ప్రాంతం సరిహద్దులు, ఆక్రమణలు నివారణ గురించి మాట్లాడారు. అటవీ చట్టాల గురించి ఫ్లయింగ్‌స్క్వాడ్ డీఎఫ్‌ఓ గురు ప్రభాకర్ తెలిపారు. వన్యప్రాణుల వేట నిందితులను పట్టుకోవడం, సాక్ష్యాల సేకరణ, నిందితులను ఎలా పట్టుకోవాలి.. కేసు నమోదు గురించి తెలియజేశారు. ఏ అంశాలు నాన్ బెయిల్ కింద వస్తాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. బెయిలబుల్ కేసులు ఏవి, ఏ కేసుకు ఎంత జరిమానా, శిక్ష పడుతుందో విశదీకరించారు. కార్యక్రమంలో శిక్షణ డీఎఫ్‌ఓ సంకేత్‌గౌడ్, ఎఫ్‌ఆర్వోలు థామస్, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment