కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి
చిత్తూరు కార్పొరేషన్ : పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్, డీపీఓ కార్యాలయంలో డీపీఓ సుధాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పలురకాల సర్వేలు, కార్యక్రమాలు విజయవంతం కావడంలో కార్యదర్శుల పాత్ర కీలకమైనదన్నారు. ప్రసుత్తం మిస్సింగ్ సిటిజన్, ఎంప్లాయిస్, ఆధార్ సర్వే, వర్క్‌ఫ్రంహోం, హౌస్ హోల్డర్స్, డెత్ రీవెరిఫికేషన్, పీఎసీఎస్, ఎన్‌పీసీఎల్, నాన్ ఏపీ రెసిడెన్స్, విలేజ్ అసెట్, ప్రొఫెల్ సర్వేలు చేస్తున్నామన్నారు. వీటితో పాటు తమ రోజువారి విధులు అయిన ఇంటి , నీటి పన్నులు, లైసెన్స్, లీజ్, వేలం పాట ఇతర పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్మికంపోస్టు పర్యవేక్షణ, వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, భూముల సర్వే వంటి పనుల చేస్తున్నామన్నారు. సర్వేలకు సచివాలయ సిబ్బంది సహకారం లేదన్నారు. దీంతో పని ఒత్తిడి కార్యదర్శులపై పడుతోందన్నారు. సచివాలయ సిబ్బంది సర్వే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గిరి, శివశంకర్, రమేష్ పాల్గొన్నారు.
సహకరించని సచివాలయ ఉద్యోగులు
డీపీఓకు నాయకులు వినతి
Comments
Please login to add a commentAdd a comment