జనారణ్యంలోకి దుప్పి
చిత్తూరు కార్పొరేషన్ : నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రాంతంలో దుప్పి కనిపించింది. శుక్రవారం ఉదయం రెడ్డిగుంట అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి కళాశాల ప్రాంగణం వైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. జనాలను చూసి భయపడటంతో పరుగులు తీస్తూ సమీపంలోని కమ్మీలకు కొమ్ములు చిక్కుకోవడంతో అక్కడ ఇరుక్కుపోయింది. గమనించిన కళాశాల సిబ్బంది అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని దుప్పిని రక్షించి పశువైద్యశాలకు తరలించారు. చికిత్స ఇచ్చిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఎఫ్‌బీఓ గౌస్‌బాషా తెలిపారు.
దొంగలు అరెస్టు..
బంగారం స్వాధీనం
గడుపల్లె : ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి నగలు దొంగలించిన గోపాల్, ఇబ్రహీం నిందితులను గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు పట్టుకుని నగలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. గుడుపల్లె మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన వళ్లీయమ్మ ఇంట్లో ఈనెల 16వ తేదీన ఇంటి తాళాలు పగలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి నగలను దొంగలించుకు వెళ్లారన్నారు. దొంగలించిన నగలు అమ్ముకునేందుకు శాంతీపురానికి వెళుతుండగా మార్గమధ్యలో పోలీసులు సమాచారం తెలుసుకుని వెళ్లి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. గత ఏడాది రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లెలోని ఒక సూపర్ మార్కెట్‌లో రాత్రి సమయంలో షట్టర్లు ఎత్తి దొంగలించిన కేసు కూడా రామకుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు.
జనారణ్యంలోకి దుప్పి
Comments
Please login to add a commentAdd a comment