కిక్కిరిసిన ‘సదరం’
కుప్పం : కుప్పం వంద పడకల ఆస్పత్రిలో దివ్యాంగుల కోసం శుక్రవారం నిర్వహించిన సదరం శిబిరానికి విశేష స్పందన వచ్చినట్లు కడా పీడీ వికాస్ మరమ్మత్ తెలిపారు. గుడుపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాలకు చెందిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 2,247 మంది దివ్యాంగులు హాజరై చికిత్సలు చేసుకున్నారు. వీరిలో 1407 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
నేడు మున్సిపాలిటీ, రూరల్ ఏరియాలో శిబిరం
శనివారం కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రూరల్ పరిధిలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment