చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ
తిరుపతి సిటీ : ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాలు కీలకపాత్రం పోషిస్తాయని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కలీముల్లా తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ‘చిరుధాన్యాలపై అవగాహన, ప్రాసెసింగ్ యంత్రాల సందర్శన’ అనే అంశంపై 25 మంది ఎస్సీ మహిళలకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకుంటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయని చెప్పారు. అనంతరం చిరుధాన్యాలను శుద్ధి చేయడం, పొట్టు తీయడం, తినుబండారాల తయారీపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రక్తపోటు, చక్కెర వ్యాధి, అధిక కొవ్వును అరికట్టవచ్చని వెల్లడించారు. అనంతరం మహిళలకు కిట్, సర్టిఫికెట్లతో పాటు తినుబండారాలను పంపిణీ చేశారు.
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. చిత్తూరు నగరం మాపాక్షిలో శుక్రవారం ఫ్రైడే డ్రైడేను నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాపాక్షిలోని కొన్ని వీధులను పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. దోమల వ్యాప్తితో వచ్చే వ్యాధులను గుర్తు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రామకృష్ణ, నారాయణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment