27న షబ్–ఏ–ఖదర్
చిత్తూరు రూరల్ : ముస్లింలు షబ్ ఏ ఖదర్ పండుగను ఈనెల 27వ తేదీన జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ జనాబ్ మోల్వి సయ్యద్ షా మహమ్మద్ కమాలుల్లా జుహురీ లతీఫ్ జునైది ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో జాగారం, నమాజు చేసి విశ్వ శాంతికి అల్లా వద్ద దువా చేయాలన్నారు.
నెల రోజుల్లో ఎలిఫెంట్ బేస్ క్యాంపు
● త్వరలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రాక
● పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు
పలమనేరు : మరో నెల రోజుల్లో ముసలిమొడుగు వద్ద నిర్మిస్తున్న ఎలిఫెంట్ బేస్‌క్యాంపు పనులు పూర్తికానున్నాయని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోధ పేర్కొన్నారు. ఆ మేరకు మండలంలోని కాలువపల్లి వద్ద సాగుతున్న ఎలిఫెంట్ క్యాంపు పనులను శనివారం ఆమె పరిశీలించారు. ఇందులో డీఎఫ్ భరణి, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఇక్కడ సాగుతున్న అన్ని రకాల పనులు 80శాతం పూర్తయ్యాయని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి శిక్షణ పొందిన నాలుగు ఏనుగులను ఇక్కడికి రప్పించనున్నట్లు తెలిపారు. బేస్ క్యాంపు చుట్టూ ఎలిఫెంట్ ఫ్రూప్ ట్రెంచిలు, హ్యాగింగ్ సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కౌండిన్యలోని మదపు టేనుగుల బారీ నుంచి కుంకీ ఏనుగుల ద్వారా మళ్లించడం జరుగుతుందన్నారు. ఇక్కడి ప్రజల సందర్శనార్థం సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
భయపడే ప్రసక్తే లేదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, దాక్కోవాల్సిన గతి పట్టలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్న కుమార్తె వద్దకు వెళితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 145 గ్రామాల్లోని ఆలయాలను రూ.10లక్షల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంవలో రోడ్లు వేశామని, తాగునీటి ట్యాంకులు నిర్మించామని, అవినీతికి తావు లేకుండా గ్రామీణాభివృద్ధికి కృషి చేశామని వివరించారు. కుమార్తె దగ్గరకు వెళితే భయపడి వెళ్లిపోయారని చెప్పడం కరెక్టు కాదన్నారు. అలాగైతే విదేశాలకు వెళ్లేవారంతా భయపడి వెళుతున్నారా అంటూ ప్రశ్నించారు. అసత్య ప్రచారాలను వదలిపెట్టి, ప్రజాసేవపై దృష్టిపెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసలు పనులను పక్కనపెట్టి కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
క్షతగాత్రులకు పరామర్శ
శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లె వద్ద ట్రాక్టర్ బోల్తా ఘటనలో గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు.బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, ఎస్‌ఆర్‌పురం మండల అధ్యక్షుడు మణి, నేతలు సాము, వెంకటేష్‌రెడ్డి పాల్గొన్నారు.
27న షబ్–ఏ–ఖదర్
Comments
Please login to add a commentAdd a comment