సైబర్ క్రైమ్ బాధితుడి సత్వర న్యాయం
యాదమరి/చిత్తూరు అర్బన్: సైబర్ క్రైమ్‌నకు గురైన బాధితులు తక్షణం స్పందించి, పోలీసులకు సమాచారం ఇస్తే.. సత్వర న్యాయం జరుగుతుందని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీని అర్థం ఎలాంటిదో ఈ ఘటనే నిదర్శనం. యాదమరి మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఈనెల 20వ తేదీన రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రెండుమార్లు ఓటీపీ మెసేజ్ వచ్చింది. మొదటిగా రూ.1,12,900, రెండోసారి రూ.23 వేలు తన ఖాతా నుంచి ఖర్చయినట్లు సారాంశం. కొద్దిసేపు ఆలోచించిన వ్యక్తి, తాను ఆన్‌లైన్‌లో ఏదీ కొనుగోలుచేయలేదని నిర్ధారించుకున్న తరువాత రాత్రి 10.50 గంటలకు యాదమరి ఎస్‌ఐ ఈశ్వర్‌కు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టర్ (ఎన్‌సీఆర్‌పీ) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆదివారం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌క్రైమ్ ద్వారా దొంగిలించిన మొత్తం కూడా అతని ఖాతాలో జమ చేసేలా చేశారు. మోసం జరిగినప్పుడు బాధితులు వెంటనే ఫోన్–1930, పోలీసు వాట్సప్–9440900005 నంబర్లకు సమాచారం ఇస్తే, త్వరగా చర్యలు తీసుకుని డబ్బులు తెప్పించే ప్రయత్నం చేస్తామని ఎస్పీ తెలిపారు.
కార్యదర్శులకు కౌన్సెలింగ్
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవా రం కౌన్సెల్సింగ్ నిర్వహించా రు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్‌నాయు డు, డీపీఓ సుధాకర్‌రావు ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కు పదోన్నతి పొందిన కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు. మొత్తం 83 మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో 77 మంది వారు కోరుకున్న స్థానాల ను తెలియజేశారు. సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నివేదికను ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపుతామన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగోన్నతులు, బదిలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో ఉద్యోగోన్నతి ద్వారా చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment