కోళ్లఫామ్ గోడౌన్‌కు నిప్పు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని 106 రామిరెడ్డి గారిపల్లె పంచాయతీ చెరువు ముందరపల్లెకు చెందిన నాగిరెడ్డి కోళ్ల ఫామ్ గోడౌన్‌కు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గోడౌన్‌లోని 15లక్షలు విలువ చేసే ఆటోమెటిక్ ఫీడింగ్ మిషన్, మోటరు, ఫీడర్లు, ప్లాస్టిక్ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై కల్లూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి పరిశీలించారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డీశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా గోడౌన్‌ను పరిశీలించారు.
ఉచిత ఆన్‌లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఆన్‌లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మెగా డీఎస్సీ 2025 పరీక్షకు సిద్ధం అవుతున్న బీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ శిక్షణను ఉచితంగా అందిస్తోందన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. దర ఖాస్తుతో పాటు కుల, జనన, ఆదాయ ధ్రువీకర ణ పత్రాలతో పాటు టెట్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 917742 9494 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
ఒకే మీడియంలో గణిత ప్రశ్నపత్రం
● పది పరీక్షల నిర్వహణలో సర్కారు అలసత్వం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం పదోతరగతి గణితం పరీక్ష నిర్వహించారు. అయితే ఒకే మీడియంలో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ అర్థం అయ్యేందుకు గత వైఎస్సార్‌సీపీ సర్కారు బైలింగ్వల్ విధానం ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు బైలింగ్వల్ విధానంలోనే (ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్) పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. అలాగే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ఫ్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్ట్ ప్రశ్నపత్రాలు సైతం బైలింగ్వల్‌లోనే అందించారు. అయితే పబ్లిక్ పరీక్షలకు వచ్చే సరికి గణితం ప్రశ్నపత్రం మాత్రం ఒకే లాంగ్వేజ్‌లో ముద్రించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తికమకపడి అవస్థలు ఎదుర్కొన్నారు. కీలకమైన పరీక్షలపై కూటమి ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
కోళ్లఫామ్ గోడౌన్‌కు నిప్పు