నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రొంపిచెర్ల: అధికార పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితుడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం.. మండలంలోని గానుగచింత పంచాయతీ ఓబులవారిపల్లెకు చెందిన ఉమాపతిరెడ్డి గ్రామంలో అధికార పార్టీకి చెందిన కొందరితో గడ్డి పందిరి విషయమై వివాదం నడుస్తోంది. వందేళ్లుగా గడ్డి పందిరి ఉమాపతిరెడ్డి కుటుంబం అనుభవంలో ఉంది. అయితే పార్టీ ముసుగులో కొందరు పందిరిని కూల్చి వేయడానికి ప్రయత్నిస్తున్నారని, సర్వే నంబరు 128–2, 129లలో గ్రామంలో అందరికీ భాగాల ఉన్నాయని, కొలతలు వేసి వారికి వస్తే తీసుకోమని చెప్పినా పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులను ఆశ్రయించి తన గోడు నివేదించాడు.
Comments
Please login to add a commentAdd a comment