చిత్తూరు కలెక్టరేట్ : ఫ్యాఫ్టో (ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం నిర్వహించనున్నట్లు ఆ సంఘం చైర్మన్ మునాఫ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఫ్యాఫ్టో సభ్య సంఘాలు ఎన్నికలకు హాజరు కావాలని కోరారు. ఎన్నికల పరిశీలకులుగా స్కూల్ అసిస్టెంట్ సంఘం రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి వ్యవహరిస్తారని వెల్లడించారు.
అర్హులైన ముస్లింలకు సంక్షేమ పథకాలు
● ఇఫ్తార్ విందులో జాయింట్ కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హులైన ముస్లింలకు సంక్షేమ పథకాలు అందిస్తామని జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని ఉర్ధూ షాదీ మహాల్‌లో అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. మత గురువులు, ముస్లిం సోదరుల నడుమ ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, మైనారిటీ సంస్థ ఈడీ హరినాథ్‌రెడ్డి, ముస్లిం లు పాల్గొన్నారు.