దళితుడిపై వేధింపులు
విజయపురం : బతుకు దెరువు కోసం మినరల్ వాటర్ ప్లాంట్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న జిల్లు అనే దళితుడి షాపుకు కరెంట్ కట్ చేయించి కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అతను పని చేయడమే వేధింపులకు ప్రధాన కారణమైంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు కక్ష కట్టి వేధిస్తున్నారని బాధితుడు జిల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి దళితవాడకు చెందిన జిల్లు నాలుగేళ్ల కిందట పన్నూరు సబ్‌స్టేషన్‌లో స్థలం లీజుకు తీసుకొని రూ.12 లక్షలు అప్పు చేసి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొన్నాడు. దీనికి అన్ని రకాల అనుమతి పొందారు.
వైఎస్ జగన్, రోజాపై ఉన్న అభిమానంతో 2024లో ఆ పార్టీకి మద్దతు పలికాడు. దీంతో కూటమి నేతల ఆగ్రహానికి లోనయ్యాడు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా మండల స్థాయి టీడీపీ నాయకులు వివిధ రకాలుగా తనను వేధించడం ప్రారంభించారని బాధితుడు వాపోయాడు. చివరికి విద్యుత్ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మంగళవారం మినరల్ వాటర్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే షాపునకు కరెంట్ కట్ చేయించారని బాధితుడు జిల్లు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment