
మీకు దిక్కున్న చోట చెప్పుకోండి?
గ్రామకంఠం భూమిని కూటమి నేత ఆక్రమించాడని రామానాయుడు పల్లి గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
కుప్పం మున్సిపాలిటీకి డెప్యుటేషన్ల బదిలీలు
పుత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల నుంచి పలువురు సెక్రటరీలను మూకుమ్మడిగా డెప్యుటేషన్లపై బదిలీ చేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి విధిలేక విధులు నిర్వహించడానికి వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని సెక్రటరీలు వాపోతున్నారు. పుత్తూరు మున్సిపాలిటిలోని ఎన్జీఓ కాలనీకి సచివాలయానికి చెందిన శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ సెక్ర టరీ మునస్వామి, సత్యనారాయణ కాలనీ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ చాంద్‌బాషా, కళ్యాణపురం సచివాలయానికి చెందిన ఎడ్యుకేషన్ సెక్రటరీ రిజ్వన్‌బాషా, టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు మనోజ్, వినోద్‌కుమార్‌ను కుప్పానికి డెప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ఈ మేరకు అనంతపురం మున్సిపల్ అడ్మినిస్టేషన్ రీజనల్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి.
డీసీహెచ్‌ఎస్‌గా పద్మాంజలిదేవి
చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు డీసీహెచ్‌ఎస్‌గా పద్మాంజలిదేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుంగనూరు ఏరియా ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఈమె ఉద్యోగోన్నతి వరించింది. ఈ మేరకు ప్రభుత్వం పద్మాంజలిని డీసీహెచ్‌ఎస్‌గా నియమించింది. త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఇక్కడ ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నగరి ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్ ప్రభావతి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విధితమే.
– 8లో